బన్నీ అన్నలాగా డాన్స్.. వాళ్లందరికీ నా మిడిల్ ఫింగర్, విజయ్ దేవరకొండ సంచలనం!

Recommended Video

Vijay Deverakonda Goose Bumps Speech at Taxiwaala Movie Pre Release Event | Filmibeat Telugu

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది మూడవ చిత్రంతో రాబోతున్నాడు. ఇప్పటికే విజయ్ నటించిన గీతగోవిందం, నోటా చిత్రాలు విడుదలయ్యాయి. గీత గోవిందం చిత్రం ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. త్వరలో టాక్సీవాలా చిత్రం విడుదల కాబోతోంది. ఆదివారం ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అల్లు అరవింద్ అతిథులుగా హాజరయ్యారు. ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మరోమారు తన ప్రసంగంతో ఆడియన్స్ లో ఉత్సాహం రేపాడు.

బన్నీ అన్నలాగా

బన్నీ అన్నలాగా

ప్రసంగం ఆరంభంలోనే విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించాడు. బన్నీ అన్నలాగా తాను జీవితంలో డాన్స్ చేయలేను అని తెలిపాడు. బన్నీ అన్నలాగా డాన్స్ చేయాలంటే అది గ్రాఫిక్స్ తోనే సాధ్యం. తన చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైనందుకు బన్నీకి కృతజ్ఞతలు తెలిపాడు.

తండ్రి ఆరోగ్యం సరిగాలేకపోయినా

తండ్రి ఆరోగ్యం సరిగాలేకపోయినా

ఈ సందర్భంగా విజయ్ మరోమారు తన ప్రత్యేకత చాటుకున్నాడు. టాక్సీవాలా కోసం పనిచేసిన ఒక్కొక్కరిని వేదికపైకి పిలిచి వారి కష్టాన్ని వివరించాడు. సంగీత దర్శకుడు జాక్స్ గురించి మాట్లాడుతూ.. తన తండ్రి ఆరోగ్యం సరిగా లేకపోయినా ఆ బాధని తట్టుకుని ఈ చిత్రానికి మంచి సంగీతం అందించాడని విజయ్ ప్రశంసించాడు.

అనంతపూర్ పిల్ల

అనంతపూర్ పిల్ల

హీరోయిన్ ప్రియాంక జావాల్కర్ ని పరిచయం చేస్తూ.. ప్రియాంక అనంతపూర్ పిల్ల. యాక్టర్ అవుదామని హైదరాబాద్ కు వచ్చింది. హాస్టల్ లో ఉంటూ మూడేళ్ళుగా షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తోంది. ఈ చిత్రం కోసం ప్రియాంక ఎంపికకాగానే ఆమెలో సంతోషం చూశానని విజయ్ దేవరకొండ తెలిపాడు. ఈ చిత్రం పైరసీకి గురికాబడిందని తెలిసి ఏడ్చేసింది. ఎట్టకేలకు సినిమా విడుదలవుతుండటంతో మళ్ళీ సంతోషంగా ఉందని విజయ్ తెలిపాడు.

పైరసీ చేసేవాళ్లకు నా మిడిల్ ఫింగర్

పైరసీ చేసేవాళ్లకు నా మిడిల్ ఫింగర్

సినిమాని పైరసీ చేసేవాళ్లకు నా మిడిల్ ఫింగర్ చూపిస్తా అంటూ విజయ్ దేవరకొండ అగ్రెసివ్ గా సంచలన వ్యాఖ్యలు చేశాడు. పైరసీ వచ్చి కొంతమంది సినిమా చూస్తారు. వారి క్యూరియాసిటీ అర్థం చేసుకోగలను. కానీకొంతమంది అదేపనిగా లింకులు షేర్ చేస్తుంటారు. వాళ్ళని ఏమనాలి అంటూ విజయ్ దేవరకొండ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఎడిటింగ్ కాకముందే

ఎడిటింగ్ కాకముందే

టాక్సీవాలా చిత్రం ఎడిటింగ్ కూడా పూర్తి కాకముందే పైరసీ చేశారు. అలా సినిమా చూస్తే ఏమర్థమవుతుంది. మీరంతా నవంబర్ 17న థియేటర్స్ లోనే సినిమా చూడాలని విజయ్ అభిమానులని కోరాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X