Kushi Censor Review: ఖుషి మూవీకి సెన్సార్ సభ్యుల రివ్యూ ఇదే.. విజయ్ కెరీర్‌లో రెండో సినిమాగా!

కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను సొంతం చేసుకుని.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఈ ఊపులోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం పరాజయాల పరంపరతో ఇబ్బందులు పడ్డాడు.

దీనికితోడు గత ఏడాది 'లైగర్' మూవీతో బిగ్గెస్ట్ డిజాస్టర్‌ను చవి చూశాడు. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు విజయ్ 'ఖుషి' అనే సినిమాను చేస్తున్నాడు. ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ వివరాలు లీక్ అయ్యాయి. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!

Vijay Deverakonda Starrer Kushi Movie Gets Clean U Certificate

ఖుషి అంటూ వస్తున్నాడు: శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తోన్న చిత్రమే 'ఖుషి'. సమంత రూత్ ప్రభు హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. దీనికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించాడు. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రలు చేశారు.

Vijay Deverakonda Starrer Kushi Movie Gets Clean U Certificate

షూట్ ఆలస్యం.. కంప్లీట్‌గా: క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'ఖుషి' మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. దీనికితోడు సమంత కూడా అనారోగ్యంతో చిత్రీకరణకు దూరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయింది. ఆ వెంటనే చిత్ర యూనిట్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసేసింది.

Vijay Deverakonda Starrer Kushi Movie Gets Clean U Certificate

అప్పుడే రిలీజ్.. ప్రమోషన్: ప్యూర్ లవ్ స్టోరీతో రూపొందుతోన్న 'ఖుషి' మూవీని సెప్టెంబర్ 1వ తేదీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్‌తో పాటు కొన్ని పాటలను కూడా విడుదల చేసింది. అలాగే, ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితమే ఓ మ్యూజిక్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇది గ్రాండ్ సక్సెస్ అయిపోయింది.

Vijay Deverakonda Starrer Kushi Movie Gets Clean U Certificate

ఖుషి మూవీకి ఆ సర్టిఫికెట్: విజయ్ దేవరకొండ - సమంత రూత్ ప్రభు కాంబినేషన్‌లో రాబోతున్న 'ఖుషి' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు వీక్షించినట్లు తెలిసింది. అంతేకాదు, దీనికి సెన్సార్ బోర్డ్ సభ్యులు క్లీన్ యూ (U) సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

సెన్సార్ రివ్యూ ఏంటంటే: ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. 'ఖుషి' మూవీని చూసిన సెన్సార్ సభ్యులు ఈ కంటెంట్‌కు ఫిదా అయ్యారని తెలిసింది. ముఖ్యంగా ఇందులో ఫ్యామిలీ, యూత్‌కు కనెక్ట్ అయ్యే ఎన్నో అంశాలను చూపించారని సమాచారం. మొత్తంగా ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ఎమోషనల్ రైడ్ అవుతుందని సెన్సార్ సభ్యుల టాక్.

Vijay Deverakonda Starrer Kushi Movie Gets Clean U Certificate

విజయ్ కెరీర్‌లో రెండోది: విజయ్ దేవరకొండ ఇప్పటికే హీరోగా 11 సినిమాలు చేశాడు. అందులో అతడి మొదటి చిత్రం 'పెళ్లి చూపులు' మాత్రమే క్లీన్ యూ సర్టిఫికెట్‌ను అందుకుంది. దీని తర్వాత 'ఖుషి'కి మాత్రమే ఆ సర్టిఫికెట్ లభించింది. దీంతో ఇది కూడా 'పెళ్లి చూపులు' రేంజ్‌లో సక్సెస్‌ను సొంతం చేసుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. దీనిపై విజయ్ ఫ్యాన్స్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X