వరుణ్ తేజ్‌కి విజయ్ దేవరకొండ సపోర్ట్.. అనుకోకుండా జరిగిందంటూ!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన 'వాల్మీకి' సినిమాపై గతంలో రాజుకున్న వివాదం బాగా ముదిరి చివరకు టైటిల్ మార్చే స్థాయి వరకూ వచ్చిన సంగతి తెలిసిందే. తీరా విడుదల తేదీ (సెప్టెంబర్ 20) దగ్గరపడిన తర్వాత కూడా విషయం సీరియస్ గానే ఉండటంతో వాల్మీకి టైటిల్ మార్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు దర్శకనిర్మాతలు. వాల్మీకి సినిమా పేరును 'గద్దలకొండ గణేష్'గా మార్చేస్తునట్లు అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
ఈ విషయమై ప్రెస్ మీట్ పెట్టి కూడా టైటిల్ మార్చడంపై వివరణ ఇచ్చారు దర్శకనిర్మాతలు. ఇక ఈ రోజే (సెప్టెంబర్ 20న) విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే తాజాగా వాల్మీకి టైటిల్ మార్పు విషయమై విజయ్ దేవరకొండ రెస్పాండ్ అవుతూ వరుణ్ తేజ్‌కి, హరీష్ శంకర్‌కి తన సపోర్ట్ ప్రకటించాడు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టిన.. ''అనుకోకుండా అలా జరిగింది. కానీ ఇప్పుడు థియేటర్లన్నీ ప్రేక్షకులతో కిటకిటలాడుతున్నాయి. సినిమా చూసి ఆడియన్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. వరుణ్ తేజ్‌కి, హరీష్ శంకర్‌కి, చిత్ర యూనిట్ మొత్తానికి నా సపోర్ట్ తెలుపుతున్నా'' అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్ గా వచ్చింది వాల్మీకి (గద్దలకొండ గణేష్) మూవీ. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా.. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











