వామ్మో రౌడీ క్రేజ్‌ను ఇలా కూడా వాడేస్తున్నారా?.. విజయ్‌తో సినిమా అంటూ మోసాలు!

టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలో స్టార్ స్టేటస్ పొందిన హీరో విజయ్ దేవరకొండ. విజయ్‌కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ కేవలం సినిమాల వల్లే వచ్చింది కాదు. ఆయన యాటిట్యూబ్, స్టైల్, మాట్లాడే తీరు ఇలా ప్రతీ ఒక్కటి సామాన్య ప్రేక్షకులకు సైతం నచ్చేశాయి. సామాన్య జనాలకు దగ్గరగా ఉండే అతని మనస్తత్వమే నేడు ప్యాన్ ఇండియన్ స్టార్‌గా అయ్యేందుకు బాటలు వేసింది. విజయాలు వస్తేనో, అపజయాలు పలకరిస్తేనో విజయ్ క్రేజ్‌లో మార్పులు రావు. ఎప్పటికీ తమకు ఇష్టమైన రౌడీ హీరోగానే సినీ అభిమానులు చూసుకుంటారు.

యూత్ ఐకాన్...

యూత్ ఐకాన్...

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్‌గా మారిపోయింది. సొంతంగా ప్రారంభించిన రౌడీ బ్రాండ్ ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక బయట సినిమా ఫంక్షన్లలో విజయ్ ధరించే క్యాస్టూమ్స్, డిజైన్స్ ఏ రేంజ్‌లో వైరల్ అవుతాయో అందరికీ తెలిసిందే. విజయ్‌ ఫాలోయింగ్ మొత్తం దక్షిణాదిన ఉండగా.. ఇక ఉత్తరాదినా పాగా వేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఫైటర్‌తో ప్యాన్ ఇండయన్ స్టార్..

ఫైటర్‌తో ప్యాన్ ఇండయన్ స్టార్..

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న పూరి జగన్నాద్.. ఫైటర్ చిత్రంతో విజయ్‌ను ప్యాన్ ఇండియన్ స్టార్‌గా మార్చబోతోన్నాడు. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేతో విజయ్ రొమాన్స్ చేయించి అక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యేలా అద్భుతమైన కథతో ఫైటర్‌గా రాబోతోన్నాడు.

ప్రస్తుతం ఆ పనిలో బిజీగా..

ప్రస్తుతం ఆ పనిలో బిజీగా..

ప్రస్తుతం ఫైటర్ కోసం శరీరాకృతిని మార్చుకునే పనిలో పడ్డాడు విజయ్ దేవరకొండ. అసలే ఫైటర్ కోసం కొత్త లుక్‌, బాడీని ట్రై చేయబోతోన్నాడు. లాక్డౌన్ వల్ల మళ్లీ బాడీలో మార్పులు రావడంతో.. జిమ్‌లో కసరత్తులు ప్రారంభించాడు. ఇక త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా విజయ్ సినిమాకు క్యాస్టింగ్ కాల్ అంటూ మోసాలు జరుగుతున్నాయి. వాటిపై విజయ్ టీం స్పదించింది.

కఠిన చర్యలు..

కఠిన చర్యలు..

విజయ్ దేవరకొండతో సినిమాలు తీస్తున్నామని కొన్ని కంపెనీలు ప్రకటిస్తూ.. క్యాస్టింగ్ కాల్‌ను నిర్వహిస్తోన్నట్టు మాకు తెలిసింది. అందులో ఎలాంటి వాస్తవాలు లేవు. ఏదైన కొత్త చిత్రం ప్రారంభిస్తే విజ‌య్ దేవ‌ర‌కొండ లేదా నిర్మాత‌లు ప్ర‌క‌టిస్తారు. విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ఖాతాల్లో వాటిని ప్రకటిస్తాం. అత‌ని పేరుని దుర్వినియోగం చేస్తూ మోసాల‌కి పాల్ప‌డుతున్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామని విజయ్ టీం స్పందించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X