రష్మికని టార్గెట్ చేయడంతో ఆలోచనలో పడ్డ విజయ్ దేవరకొండ.. ఇలాంటివి ఇంకా ఉన్నాయా!

Recommended Video

Vijay Deverakonda Upset With Fans For Targeting Rashmika Mandanna | Filmibeat Telugu

డియర్ కామ్రేడ్ టీజర్ విడుదలయ్యాక రష్మిక మరోమారు నెటిజన్లకు టార్గెట్ గా మారింది. ఛలో, గీత గోవిందం చిత్ర విజయాలతో రష్మికకు టాలీవుడ్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. యువతకు రష్మిక బాగా కనెక్ట్ అయింది. గీత గోవిందం తర్వాత రష్మిక దేవదాస్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించాలేదు. ప్రస్తుతం మరోమారు విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తోంది. డియర్ కామ్రేడ్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఇందులోని ముద్దు సన్నివేశం బాగా సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే రష్మిక స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఫ్యాన్స్ ట్రోలింగ్ పై విజయ్ దేవరకొండ కూడా తన సన్నిహితుల వద్ద భాదపడినట్లు తెలుస్తోంది.

ఘాటైన ముద్దు

ఘాటైన ముద్దు

డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కార్మిక సమస్యలపై ఈ చిత్రం ఉంటుందట. ఆ మధ్యన విడుదల చేసిన టీజర్ లో విజయ్, రష్మిక మధ్య ఘాటైన ముద్దు సన్నివేశాన్ని చెప్పించారు. ఈ సన్నివేశం అటు రష్మికతో పాటు, విజయ్ దేవరకొండకు కూడా లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతోంది. రష్మిక కన్నడ అభిమానులు ఆమెని దారుణంగా ట్రోల్ చేసినసంగతి తెలిసిందే.

విజయ్ దేవరకొండకు ఇబ్బందులు

విజయ్ దేవరకొండకు ఇబ్బందులు

డియర్ కామ్రేడ్ టీజర్ వల్ల విజయ్ దేవరకొండకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రంలో ఇలాంటి ముద్దు సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అప్పట్లో ఆ చిత్రం యువతని బాగా ఆకర్షించింది. మరోమారు విజయ్ లిప్ లాక్ సీన్ లో కనిపించడంతో టాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ అంటూ కొందరు పిలుస్తున్నారు. రష్మికపై జరుగుతున్న ట్రోలింగ్, తనని ఇమ్రాన్ హష్మీతో పోల్చడంపై విజయ్ దేవరకొండ అప్సెట్ అయినట్లు తెలుస్తోంది.

 ఇంకా ఉన్నాయి

ఇంకా ఉన్నాయి

డియర్ కామ్రేడ్‌లో ఇలాంటి సన్నివేశాలు ఇంకా ఉన్నాయని, వాటిని చూశాక ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో అని విజయ్ దేవరకొండ తన సన్నిహితుల వద్ద అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒక ముద్దు సన్నివేశంపై ప్రేక్షకులు రష్మికని బూతులు తిడుతూ, ఇంతలా రియాక్ట్ అవుతారని విజయ్ దేవరకొండ ఊహించలేదట. డియర్ కామ్రేడ్ చిత్రంలో రష్మికతో సన్నిహితంగా ఉన్న రొమాంటిక్ సన్నివేశాలపై విజయ్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

భరత్ కమ్మ దర్శత్వంలో

భరత్ కమ్మ దర్శత్వంలో

డియర్ కామ్రేడ్ చిత్రంతో భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో రష్మిక విజయ్ దేవరకొండ సరసన రెండవ సారి నటిస్తోంది. మైత్రి మూవీస్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మే నెలాఖరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అర్జున్ రెడ్డి చిత్రం కూడా వివాదాలతోనే విడుదలైన సంచలన విజయం సాధించింది. ఇక డియర్ కామ్రేడ్ చిత్రం ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X