వరల్డ్ ఫేమస్ లవర్.. విజయ్ కంటే ముందు ఆ హీరోలు చేయలని అనుకున్నారట!

కొన్ని సినిమా కథలు తెరపైకి రావడానికి ఎంతో మంది హీరోల చుట్టూ తిరుగుతుంటాయి. స్క్రిప్ట్ సెట్టయినంత మాత్రాన సినిమా షూటింగ్ అంత ఈజీగా కొనసాగదు. పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేము. కథలపై నమ్మకం ఎప్పుడు కోల్పోతారో కూడా తెలియదు. షూటింగ్స్ మధ్యలో ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా కొంత మంది హీరోల చుట్టూ తిరిగిందట.

బిగ్గెస్ట్ డిజాస్టర్

బిగ్గెస్ట్ డిజాస్టర్

ఈ ఏడాది లవర్స్ డేను టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇదివరకు విజయ్ ప్లాప్స్ చూసినప్పటికి పెట్టిన బడ్జెట్ కి ఈ సినిమా సరైన కలెక్షన్స్ ని అందించలేకపోయింది. అసలు విజయ్ ఈ సినిమా ఎందుకు చేశాడో అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

విజయ్ కంటే ముందు..

విజయ్ కంటే ముందు..

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా అసలు విజయ్ చేయాల్సింది కాదట. మొదట ఈ సినిమా చాలా మంది హీరోల దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే కొందరు డేట్స్ లేక వద్దనుకుంటే.. మరికొందరు కథ నచ్చక వదిలేశారట. అందులో ఒక మెగా హీరో కూడా ఉన్నాడు.

స్టార్ట్ చేయాలని అనుకున్నాడట..

స్టార్ట్ చేయాలని అనుకున్నాడట..

అంధరికంటే ముందు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ కథను విన్నట్లు తెలుస్తోంది. దాదాపు సినిమా స్టార్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక సినిమాను స్టార్ట్ చేయాలని షెడ్యూల్స్ సెట్ చేసుకుంటున్న తరుణంలో ఎందుకో సాయి ధరమ్ తేజ్ కి సినిమా స్క్రీన్ ప్లేపై నమ్మకం కలగలేదట. దీంతో సెట్స్ పైకి రాకముందే సినిమాను ఆపేశాడట.

Recommended Video

Mega Star Chiranjeevi About Talasani Seva Trust
ఆ హీరో కూడా..

ఆ హీరో కూడా..

చివరికి శర్వానంద్ కూడా ఈ సినిమాను జస్ట్ లో మిస్ చేసుకున్నాడట. క్రాంతి మాధవ్ తో ఇదివరకే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా చేసిన శర్వానంద్ వరల్డ్ ఫేమస్ లవర్ కథ వినగానే సినిమా చేయాలని అనుకున్నాడట. కానీ అప్పటికే బిజిగా ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడట. ఈ విధంగా పెద్ద డిజాస్టర్ నుంచి ఈ హీరోలు అనుకోని విధంగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X