twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBD Vijay Deverakonda: మహేష్, ప్రభాస్‌‌ను బీట్ చేసిన విజయ్ దేవరకొండ.. క్రేజీ కా బాప్ అంటే ఇదేనేమో..

    |

    దక్షిణాదిలో క్రేజీ హీరో ఇమేజ్‌ సంపాదించుకొన్న విజయ్ దేవరకొండ అన్ని విధాలుగా దూసుకెళ్తున్నాడు. గత రెండు చిత్రాలు ప్రేక్షకులను, బాక్సాఫీస్‌ను అంతగా మెప్పించలేకపోయినా.. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం చెక్కు చెదరకపోగా.. భారీగా అభిమానులను ఆకట్టుకొంటున్నాడు. లాక్‌డౌన్‌లో ఉంటూ తాజా కొన్ని అంశాలతో టాలీవుడ్‌ హీరోల కొందరికంటే ఎక్కువ మైలేజ్‌ను సొంతం చేసుకొన్నాడు. ఇలా సంచలనాలతో ముందుకెళ్తున్న విజయ్ దేవరకొండ మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకొన్నాడు. అదేమిటంటే..

    లాక్‌డౌన్‌లో సంచలన విషయాలు

    లాక్‌డౌన్‌లో సంచలన విషయాలు

    టాలీవుడ్‌లో కొన్ని విమర్శలకు చెక్ పెట్టే విధంగా లాక్‌డౌన్ సమయంలో ఏ హీరో తీసుకోని విధంగా విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం తీసుకొన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్థికంగా వెనుకబడి.. తినడానికి తిండి, మందులు కొనుక్కోలేని ఫ్యామిలీలకు అండగా నిలబడ్డారు. మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో ఓ చారిటీని, ఆన్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 8 వేల కుటుంబాకుపైగా సహాయం అందించి ప్రశంసలు సొంతం చేసుకొన్నారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో గణనీయమైన ప్రేక్షకదారణను సొంతం చేసుకొనే అవకాశాన్ని దక్కించుకొన్నారు.

    ఫేక్ న్యూస్ సంచలనం వ్యాఖ్యలు

    ఫేక్ న్యూస్ సంచలనం వ్యాఖ్యలు

    ఇక మిడిల్ క్లాస్ ఫండ్‌పై ఫేక్ న్యూస్ రాస్తున్నారంటూ ఓ వర్గం మీడియాను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో టాలీవుడ్ సినీ వర్గాల మద్దతును కూడగట్టుకోవడంలో విజయ్ దేవరకొండ సఫలమయ్యారు. మహేష్, చిరంజీవి, పలువురు డైరెక్టర్లు, హీరోలు విజయ్ దేవరకొండకు అండగా నిలిచారు. దీంతో మరో రకంగా కొత్త ఇమేజ్‌ను సొంతం చేసుకొన్నారు.

    ఇన్స్‌టాగ్రామ్ సరికొత్త మైలురాయిగా

    ఇన్స్‌టాగ్రామ్ సరికొత్త మైలురాయిగా


    ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో అరుదైన ఫీట్‌ను సాధించారు. ఇన్స్‌టాగ్రామ్‌లో 7 మిలియన్ల ఫాలోవర్స్‌ను తన ఖాతాలో వేసుకొన్నారు. అయితే టాలీవుడ్‌లో స్టార్ హీరోలు మహేష్ బాబు, ప్రభాస్ కంటే విజయ్ దేవరకొండకే ఎక్కువ ఫాలోవర్స్ ఉండటం గమనార్హం.

    ప్రభాస్‌ను, మహేష్‌ను అధిగమించి

    ప్రభాస్‌ను, మహేష్‌ను అధిగమించి

    సొషల్ మీడియాలోని ఇన్స్‌టాగ్రామ్‌లో మహేష్ బాబుకు 4.6 మిలియన్ల ఫాలోవర్స్, ప్రభాస్‌కు 4.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. హీరోగా కొద్దికాలం క్రితమే ఇండస్ట్రీకి వచ్చిన హీరో విజయ్ దేవరకొండ తక్కువ సమయంలోనే 7 మిలియన్లను ఫాలోవర్స్‌ను సంపాదించుకోవడం యువ హీరో క్రేజ్‌ను తెలియజేస్తుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

    Recommended Video

    Pawan Kalyan Fans Questions Tollywood Big Stars | Vijay Devarakonda
    విజయ్ దేవరకొండ కెరీర్ పరంగా

    విజయ్ దేవరకొండ కెరీర్ పరంగా

    ఇక కెరీర్ విషయానికి వస్తే.. డియర్ కామ్రేడ్ కమర్షియల్‌గా మంచి ఫలితాలే సాధించినప్పటికీ.. ప్రేక్షకులను, సినీ విమర్శకులను మెప్పించలేకపోయింది. అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విజయ్‌కి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇంకా పలు బాలీవుడ్ ప్రాజెక్టుల, ఇతర తెలుగు సినిమా ప్రాజెక్టులపై చర్చలు జరుగుతున్నాయి.

    English summary
    Arjun Reddy fame Vijay Deverkonda sets a new record in Instagram app. He gets 7 million followers in his Instagram account. With this feat, Vijay Deverakonda beats Mahesh Babu, Prabhas in Instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X