twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాద్‌షా’ తమిళ రీమేక్‌పై కన్నేసిన విజయ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 'బాద్ షా' సినిమాపై విడుదలపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందే సినిమాపై ఈ రేంజిలో హైప్ రావడంతో తమిళ స్టార్ హీరో విజయ్ కన్ను 'బాద్‌షా' పై పడింది. వెంటనే ఈ చిత్ర నిర్మాత గణేష్‌ను 'పివిపి పిక్చక్స్' ద్వారా సంప్రదించారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

    విజయ్ గతంలో అనేక తెలుగు సినిమాల రీమేక్‌లలో నటించారు. ఆయన కెరీర్లో వచ్చిన హిట్ సినిమాల్లో తెలుగు సినిమాల రీమేకులే ఎక్కువ. తెలుగు సినిమా పవర్ ఏ రేంజిలో ఉంటుందో ఇప్పటికే రుచి చూసిన విజయ్.....'బాద్ షా' జోలికి ఇతర తమిళ హీరోలు రాకుండా అప్పుడే కర్చీప్ వేసాడు.

    'బాద్ షా' చిత్రం జూ ఎన్టీఆర్ కెరీర్లో భారీ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇదివరకెన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ ఈచిత్రంలో వివిధ రకాల గెటప్స్ లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రేక్షకులు సరికొత్త ఎన్టీఆర్‌ను చూడబోతున్నారు.

    'బాద్ షా' చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీలోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందించారు. ఈ చిత్రానికి థమన్, కె.వి.గుహన్, గోపీమోహన్, కోనవెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎంఆర్ వర్మ, చలసాని రామారావు సాంకేతిక వర్గం. సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    The buzz is that Tamil star Vijay expressing a keen interest on acquiring the remake rights of Young Tiger NTR’s ‘Baadshah’. Vijay has approached Producer Bandla Ganesh through PVP pictures.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X