హీరో కటౌట్‌కు పాలాభిషేకం చేస్తూ.. అభిమాని మృతి
హైదరాబాద్: తమ అభిమాన హీరో కోసం తమ ప్రాణాలు సైతం ఇస్తానంటూంటారు అభిమానం. ఒక్కోసారి ఆ మాటలు నిజమై అంతులేని ఆ అభిమానం ఒక్కోసారి ప్రాణాలు కూడా తీస్తుంది. రీసెంట్ గా అలాంటి సంఘటన ఒకటి కేరళలలో జరిగింది. విజయ్ హీరోగా నటించిన తమిళ సినిమా కత్తి విడుదల రోజే విచారం చోటు చేసుకుంది.
విజయ్ కటౌట్‌కు పాలాభిషేకం చేస్తూ ఓ అభిమాని పై నుంచి పడిపోయి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం ఉన్ని కృష్ణన్(25) అనే యువకుడు వెల్డింగ్‌పని చేసుకుంటూ ఉంటాడు. కేరళ రాష్ట్రం వాడకెన్‌చరిలోని జయభారత్ థియేటర్‌లో విజయ్ కటౌట్‌కు పాలాభిషేకం చేయడానికి పైకెక్కాడు.

ప్రమాదవశాత్తూ అక్కడి నుంచి జారి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతను విజయ్ ఫాన్స్ అసోసియేషన్‌లో చురుకుగా పనిచేసేవాడని స్థానికులు తెలిపారు. కత్తి చిత్రం దీపావళి సందర్భంగా బుధవారం విడుదలైంది. అనేక సమస్యల మధ్య విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ ని తెచ్చుకుంది.
ఇక మురుగదాస్ కథలన్నీ విభిన్నంగా ఉంటాయి. షార్ట్ టర్మ్ మొమొరీ లాస్ అనే కథాంశంతో 'గజిని' తీర్చిదిద్దారు. 'రమణ', 'సెవెన్త్‌సెన్స్', 'తుపాకీ' కూడా సాధారణ సినిమాలకు విభిన్నంగా సాగేవే. అందుకే మురుగదాస్ సినిమా వస్తోందంటే అందరిలోనూ ఆసక్తి. ఇప్పుడాయన 'కత్తి' పదును చూపించారు. విజయ్, సమంత జంటగా నటించిన చిత్రమిది. కె.కరుణామూర్తి, ఎ.శుభాస్కరన్ సంయుక్తంగా నిర్మించారు. అనిరుథ్ స్వరాలు అందించారు.
తెలుగు వెర్షన్ కి వస్తే.... ఈ నెల 24న 'కత్తి' పాటల్ని విడుదల చేస్తారు. చిత్ర సమర్పకుడు ఠాగూర్ మధు మాట్లాడుతూ ''థ్రిల్లర్ నేపథ్యంలో సాగే యాక్షన్ చిత్రమిది. సెంటిమెంట్‌కీ చోటుంది. అనిరుథ్ స్వరాలు అదనపు ఆకర్షణ. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.


Click it and Unblock the Notifications











