తెలుగోళ్లపై కన్నేసిన మరో తమిళ హీరో
ఇటీవల వచ్చిన పలు తమిళ అనువాద చిత్రాలు తెలుగులో సూపర్ హిట్ అయిన నేపథ్యంలో....మరికొందరు తెలుగు సినిమా మార్కెట్ పై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే సూర్య, విక్రమ్, విశాల్ లాంటి హీరోలు తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించగా, ఆర్య, జీవ లాంటి హీరోలు ఇప్పుడిప్పుడే తెలుగు తెరపై తమ సక్సెస్ రేటును పెంచుకుంటున్నారు. తాజాగా తమిళ హీరో విజయ్ కూడా తెలుగు మార్కెట్ పై కన్నేశాడు. తన తాజా సినిమా 'ఆది" సినిమాను తమిళంతో పాటు, తెలుగోల 'నేనేరా ఆది" పేరుతో విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాడు.
కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని హీరో ఎలా ప్రతిఘటించాడు, ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు? అనే యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటిస్తుండగా, రమణ దర్శకత్వం వహిస్తున్నారు. బి.సత్యనారాయణ ఈ అనువాద చిత్రానికి నిర్మాత. అక్టోబర్‌లో విడుదల కానున్న ఈ సినిమా గురంచి నిర్మాత మాట్లాడుతూ -''ఆసక్తికరమైన కథ, కథనాలతో దర్శకుడు రమణ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. కొత్తదనాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారు. తమిళంలో టాప్ స్టార్‌గా వెలుగొందుతున్న విజయ్‌ని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసే సినిమా ఇది. త్రిష గ్లామర్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ప్రకాష్‌రాజ్, సాయికుమార్ ఇందులో ప్రత్యేక పాత్రలు చేశారు. వారి నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేస్తాం"" అని తెలిపారు.
ఈ సినిమాలో వివేక్, నాజర్, మణివన్నన్, సీత తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మాటలు: రాజశేఖరరెడ్డి, సంగీతం: విద్యాసాగర్, కెమెరా: ఎస్.సుందర్‌రాజన్, నిర్వహణ: కె.రామచంద్రరావు, సమర్పణ: బీఎన్‌ఎల్ రాజేశ్వరి.


Click it and Unblock the Notifications











