»   » సల్మాన్ ఖాన్ మీద రూ. 250 కోట్ల దావా!

సల్మాన్ ఖాన్ మీద రూ. 250 కోట్ల దావా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పటికే ఓ వైపు హిట్ అండ్ రన్ కేసులో జైలు శిక్ష పడి ప్రస్తుతం బెయిల్ మీద నెట్టుకొస్తున్న సల్మాన్ ఖాన్ కు మరో కష్టం వచ్చి పడింది. సల్మాన్ మీదన్ ‘వీర్' సినిమా నిర్మాత విజయ్ గలానీ రూ. 250 కోట్లకు పరువు నష్టం దావా వేయడానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు సల్మాన్ ఖాన్ కు లీగల్ నోటీసులు పంపాడు. సల్మాన్ మూలంగా తన పరువు పోయిందని, మానసిక వేదనకు గురయినట్లు చెబుతున్న గలానీ ఇంత భారీ మొత్తంలో పరువు నష్టం దావా వేయడం హాట్ టాపిక్ అయింది.

అప్పట్లో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘వీర్' చిత్రం బాక్సాఫీసు వద్ద బొల్తా పడింది. నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ చిత్రానికి సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ 10 కోట్లు ఇచ్చేందుకు రెమ్యూనరేషన్ కుదిరిందని, సినిమా బ్రహ్మాండమైన హిట్టయి లాభాలు బాగా వస్తే రూ. 15కోట్లు ఇవ్వాలని ఒప్పందం కుదిరిందని...అయితే సినిమా మూలంగా తాను నష్ట పోయినా 15 కోట్లు ఇవ్వాలని సల్మాన్ ఖాన్ ఒత్తిడి చేసారని ఆయన అన్నారు.

 Vijay Galani Threatens to Sue Salman Khan for Rs 250 Crore

ఈ వివాదాన్ని తాను నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళితే...సల్మాన్ తన మీద ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసాడని విజయ్ గలానీ తెలిపారు. తన వద్ద ఒప్పంద పత్రం ఉండటం వల్ల కోర్టు తీర్పు తనకే అనుకూలంగా వచ్చిందని, గడచిన మూడేళ్లలో ఈ కేసు కారణంగా, సల్మాన్ ఖాన్ కారణంగా తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యానని, లాయర్లకు ఫిజు రూపంలో భారీగా చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు.

English summary
Veer producer Vijay Galani has sent a legal notice threatening to sue Bollywood superstar Salman Khan for Rs 250 crores for mental harassment and agony.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu