మహేష్, విజయ్, యష్ ఓకె చేస్తే సంచలనమే.. ఎవరూ టచ్ చేయని టాపిక్‌తో కథ రెడీ!

సినిమా అనేది శక్తివంతమైన మాధ్యమం. వెండి తెరపై వచ్చిన సందేశాత్మక చిత్రాలు చాలానే ప్రజలపై ప్రభావం చూపాయి. సందేశాత్మక చిత్రాలకు మంది ఆదరణ కూడా లభిస్తోంది. తమిళ హీరో విజయ్, హిందీలో అమిర్ ఖాన్ లాంటి హీరోల నుంచి సందేశాత్మక చిత్రాలు ఎక్కువగా వస్తుండడం చూస్తున్నాం. తాజాగా సుచిత్ర రావు అనే మహిళా రచయిత సంచలన ప్రతిపాదన చేసింది. తాను రూపొందించిన కథ ఆధారంగా అన్ని భాషల్లో సినిమా రూపొందించాలని ప్రతిపాదన చేశారు. దేశంలోనే ప్రధాన సమస్యలలో ఒకటిగా మారిన ప్రశువుల అక్రమ రవాణా మాఫియా నేపథ్యంలో సుచిత్ర రావు ఓ పుస్తకం రాశారు.

 ది హైవే మాఫియా

ది హైవే మాఫియా

సుచిత్ర రావు 2017లో ది హైవే మాఫియా పేరుతో ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ పుస్తకంలోని అంశాల ఆధారంగా అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించవచ్చని అభిప్రాయ పడ్డారు. 2004 నుంచి భారత దేశంలో పశువుల అక్రమ రవాణా అధికం అవుతోంది. ఇది కచ్చితంగా ప్రజల్లోకి బలంగా వెళ్లాల్సిన అంశం. సినిమా శక్తివంతమైన మాధ్యమం కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సుచిత్ర రావు తెలిపారు.

అన్ని భాషల్లో

అన్ని భాషల్లో

తాను రచించిన ది హై వే మాఫియా పుస్తకం ఆధారంగా అన్ని భాషల్లో స్టార్ హీరోలతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సుచిత్ర రావు తెలిపారు. తెలుగులో మహేష్ బాబు, తమిళంలో విజయ్, కన్నడలో యష్, హిందీలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ కథకు హీరోలుగా సరిపోతారని సుచిత్ర్క్ల్ రావు తెలిపారు. ఇప్పటికే కొన్ని నిర్మాణ సంస్థలతో తాను చర్చలు ప్రారంభించానని అన్నారు.

దర్శకుడి అభిప్రాయాలు

దర్శకుడి అభిప్రాయాలు

ప్రస్తుతం ఈ కథని విజయవంతంగా తెరకెక్కించగలిగే దర్శకుడి కోసం తాను వెతుకుతున్నట్లు సుచిత్ర తెలిపారు. అవసరమైతే దర్శకుడి అభిప్రాయాలకు అనుగుణంగా కథలో మార్పులు చేసేందుకు కూడా తాను సిద్ధం అని సుచిత్ర తెలిపారు. అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి అని ఆమె అన్నారు.

 చీకటి కోణాలు వెలుగులోకి

చీకటి కోణాలు వెలుగులోకి

పశువుల అక్రమ రవాణా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఎలా రాజకీయంగా వాడుకుంటున్నాయో కూడా తన పుస్తకంలో బయటపెట్టానని సుచిత్ర అన్నారు. కొన్ని ఏరియాలలో హైవే మాఫియా వలన హత్యలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది సున్నితమైన అంశమే. కానీ తప్పకుండా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. మహేష్ బాబు, విజయ్, యాష్ లాంటి స్టార్ హీరోల పేర్లు వినిపిస్తుండడం ఆసక్తిగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X