twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మాస్టర్’ కలెక్షన్లపై పెద్ద దెబ్బ.. ‘ఆహా’కు అమెజాన్‌కు తేడా అదే

    |

    థియేటర్లు, ఓటీటీల మధ్య బయటకు కనిపించని కోల్డ్ వార్ జరుగుతోంది. కరోనా, లాక్డౌన్ వంటివి థియేటర్ల వ్యవస్థను దారుణంగా దెబ్బ కొట్టేశాయి. దాదాపు తొమ్మిది పది నెలలు థియేటర్లు మూత పడే ఉన్నాయి. ఆ సమయంలో ఓటీటీలతే హవా సాగింది. ఇకపై థియేటర్లు అనేవి ఉండవేమో అనే స్థాయిలో ఓటీటీల హడావిడి కొనసాగింది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఓటీటీ సంస్థల ఆధిపత్యం ఇట్టే కనిపించింది. అందుకే ఇది ముందే గ్రహించి తెలుగులో ఆహా అనే ఓటీటీని అల్లు అరవింద్ ప్రారంభించాడు.

    పూనమ్ భజ్వా కొత్త లుక్ మాములుగా లేదు (ఫొటోలు)

    ఓటీటీల జోరు..

    ఓటీటీల జోరు..

    లాక్డౌన్ సమయంలో ఎన్నో సినిమాలకు ఓటీటీ సంస్థలు ఎరవేశాయి. చాలా సినిమాలు ఓటీటీలకే మొగ్గు చూపాయి కూడా. ఆ సమయంలో నిర్మాతలకు, థియేటర్ల వ్యవస్థలకు మధ్య ఎన్నో మాటల యుద్దాలు జరిగాయి. లాక్డౌన్ ఎత్తివేయకపోడం, థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో ఓ క్లారిటీ లేకపోవడంతో అందరూ ఓటీటీ బాట పట్టారు.

    థియేటర్లలో సందడి..

    థియేటర్లలో సందడి..

    అయితే ఈ సంక్రాంతికి సౌత్ ఇండియా బాక్సాఫీస్ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. తెలుగులో క్రాక్ దూసుకుపోతూ ఉంటే.. తమిళంలో విజయ్ మాస్టర్ సినిమా రికార్డ్ కలెక్షన్లను కొల్లగొడుతోంది. అయితే అలా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న సినిమాలకు ఓటీటీలు అడ్డు కట్ట వేస్తున్నాయి.

    బాక్సాఫీస్ జోరు..

    బాక్సాఫీస్ జోరు..

    ఓ వైపు థియేటర్లలో సినిమాలు జోరుగా ఉంటున్న తరుణంలోనే ఇలా ఓటీటీల్లో సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. క్రాక్ సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితే వస్తే.. ఆహా టీం కాస్త అర్థం చేసుకుని సినిమాను వారం రోజులు వాయిదా వేసుకున్నారు. వచ్చే నెలలో విడుదల చేస్తామని ఆహా టీం ప్రకటించింది.

    వెనక్కి తగ్గని అమెజాన్..

    వెనక్కి తగ్గని అమెజాన్..

    అలా మాస్టర్ సినిమాను అమెజాన్ ప్రైమ్ వారు జనవరి 29 నుంచి అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఓ వైపు 200 కోట్లను కొల్లగొట్టి దూసుకుపోతోన్న మాస్టర్ సినిమాను ఇలా ఇంత త్వరగా ఓటీటీలోకి తేవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక ఇలా విడుదలైన రెండు మూడు వారాలకే ఓటీటీలో ప్రసారం చేస్తే జనాలు థియేటర్లకు ఎందుకు వస్తారని ప్రశ్నిస్తున్నారు.

    Recommended Video

    Salaar Update : Vijay Sethupathi To Play Prabhas Villain In Salaar | Filmibeat Telugu
    అదే తేడా..

    అదే తేడా..

    అయితే ఆహా మన లోకల్ ఓటీటీ సంస్థ. ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకుంది. కాబట్టే సినిమా సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకుని విడుదల వాయిదా వేసుకుంది. కానీ అమెజాన్ మాత్రం అలాంటిది కాదు. అందుకే మాస్టర్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. మొత్తానికి జనవరి 29 తరువాత థియేటర్లలో మాస్టర్ సందడి ఇక కనిపించకపోవచ్చని తెలుస్తోంది.

    English summary
    Master Movie Collections drops by Amazon OTT release..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X