twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ మామూలోడు కాదు.. డిజాస్టరన్న సినిమాతోనే 200కోట్లు.. అరాచకం సామీ!

    |

    తలపతి విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లు రావాల్సిందేనని మరోసారి ఋజువయ్యింది. ఖైదీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్టర్ ఈ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాపై విడుదలకు ముందు అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ విడుదల తరువాత మొదటిరోజే డిజాస్టర్ అన్న టాక్ వచ్చింది. కానీ విజయ్ కేవలం తనకున్న క్రేజ్ తోనే డిస్ట్రిబ్యూటర్స్ ను ఒడ్డుకు చేర్చాడు.

    టెంప్ట్ అవ్వకుండా..

    టెంప్ట్ అవ్వకుండా..

    మాస్టర్ సినిమా గత ఏడాది సమ్మర్ లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కోవిడ్ ఎఫెక్ట్ వలన ఏడాది పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక సినిమాకు మధ్యలో ఓటీటీ ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా నిర్మాతలు టెంప్ట్ అవ్వలేదు. థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు ఎదురుచూశారు. ఇక సినిమా జనవరి 13న తెలుగు తమిళ్ లో ఒకేసారి రిలీజ్ కాగా హిందీలో మాత్రం జనవరి 14న రిలీజ్ అయ్యింది.

    తెలుగులో కూడా భారీ ఓపెనింగ్స్

    తెలుగులో కూడా భారీ ఓపెనింగ్స్

    ఇక మొదటిరోజే 50కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయ్ మొదటిసారి హయ్యెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్నాడు. చూస్తుంటే రానున్న రోజుల్లో కలెక్షన్స్ డోస్ ఇంకా పెంచేలా ఉన్నాడని అనిపిస్తోంది. డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా విజయ్ సినిమా కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు. అటు తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి.

    డబుల్ సెంచరీ కొట్టిన విజయ్

    డబుల్ సెంచరీ కొట్టిన విజయ్

    అయితే సినిమా మొత్తానికి డబుల్ సెంచరి కొట్టేసింది. వరల్డ్ వైడ్ గా 211కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను అందుకుంది. కేవలం తమిళ్ లోనే 110మెట్లు వచ్చాయి. ఇక 200కోట్లు అందుకున్న సినిమాల్లో విజయ్ కు ఇది నాలుగువది. నెగిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ డోస్ తగ్గలేదు. తెలుగులో అయితే సినిమా 35 శాతానికి పైగా లాభాలను కూడా అందించింది.

    ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే

    ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే

    ఇక సినిమాను ఆమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 12న రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే. ఇక కేవలం 50% ఆక్యుపెన్సీతో సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయనే విషయంలో అనేక రకాల అనుమానాలను క్రియేట్ అయ్యాయి. పైగా విడుదలైన రోజే ప్లాప్ టాక్ దెబ్బ పడినట్లు టాక్ వచ్చింది. రివ్యూలు కూడా చాలా వరకు నెగిటివ్ గానే వచ్చాయి. అయితే ఆ టాక్ తో సంబంధం లేకుండా సినిమా వరల్డ్ వైడ్ గా 200కోట్లకు పైగా వసూళ్లను అందుకోవడం విశేషం.

    English summary
    vijay receives bomb threat, Master Cinema is one of the biggest films to suffer from Corona Lockdown. Expectations are high for this big budget movie starring Kollywood star hero Vijay. The film is due for release last month. But unexpectedly the corona lock-down was not postponed. The master cinema is not released even though the theaters are open.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X