విజయ్ 180కోట్ల ప్రాజెక్ట్.. సినిమా రిలీజైతే థియేటర్స్ మొత్తం అతనికే కావాలట!
కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న అతి పెద్ద సినిమాల్లో మాస్టర్ సినిమా ఒకటి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ఈ బిగ్ బడ్జెట్ మూవీపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. అసలైతే ఈ సినిమాను గత నెలలోనే రిలీజ్ కావాల్సింది. కానీ ఊహించని విధంగా కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా వేయక తప్ప లేదు. థియేటర్స్ ఓపెన్ చేసినా కూడా మాస్టర్ సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యేలా లేదు.
దాదాపు 180కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ సినిమా బిజినెస్ డీలింగ్స్ కూడా చాలా వరకు క్లోజ్ అయ్యాయి. నెవర్ బిఫోర్ అనే విధంగా తెలుగు తమిళ్ లో ఒకేసారి మాస్టర్ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ దెబ్బకు చిత్ర యూనిట్ ఆశలు చేదిరిపోయాయి. ఇక నెక్స్ట్ దీపావళికి రిలీజ్ చేయడమే సరైనది అని నిర్మాతలు వచ్చే నవంబర్ కి సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

అయితే ఆ దీపావళికి రిలీజ్ కావాల్సిన చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు మాస్టర్ సినిమా నవంబర్ ని టార్గెట్ చెయడంతో చిన్న సినిమా నిర్మాతలు భయపడుతున్నారు. అంతే కాకుండా మాస్టర్ బిజినెస్ పెద్దది కాబట్టి చాలావరకు తమిళనాడులో 92% థియేటర్స్ ని మాస్టర్ బయ్యర్లు బుక్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
చాలా వరకు బిజినెస్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో 100% స్క్రీన్స్ ని మాస్టర్ కోసమే తీసుకున్నట్లు తెలుస్తోంది. గత నాలుగు దీపావళి ఫెస్టివల్స్ లో విజయ్ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో ఈసారి కూడా ఆయనకు సెంటిమెంట్ గా వర్కౌట్ అవుతుందని నిర్మాతలు భారీ ప్రయోగమే చేస్తున్నారు. మరి ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











