'మాస్టర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక కలెక్షన్స్ తగ్గినట్లే

తలపతి విజయ్ హీరోగా ఖైదీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ మాస్టర్. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాపై విడుదలకు ముందు అంచనాలు భారీగానే ఉన్నాయి. గత ఏడాది సమ్మర్ లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కోవిడ్ ఎఫెక్ట్ వలన ఏడాది పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక సినిమాకు మధ్యలో ఓటీటీ ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా నిర్మాతలు టెంప్ట్ అవ్వలేదు. థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు ఎదురుచూశారు.

అయితే ఫైనల్ గా టెంప్ట్ అయ్యే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అసలైతే విడుదలైన 50రోజులకు గాని ఒక సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లలో విడుదల చేయడం కుదరదు. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వలన జనాలు మళ్ళీ మళ్ళీ సినిమా థియేటర్స్ కు రాలేరు కాబట్టి ఒప్పందాల్లో మార్పులు చేసి డిజిటల్ రిలీజ్ ను తొందరగానే ఉండేలా సెట్ చేసుకున్నారు. ఇక మాస్టర్ సినిమా ఇప్పటికే పెట్టినపెట్టుబని వెనక్కి తెచ్చింది.

 Vijay Master movie ott release date fix

నెగిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ డోస్ తగ్గలేదు. తెలుగులో అయితే సినిమా 30 శాతానికి పైగా లాభాలను కూడా అందించింది. ఇక సినిమాను ఆమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 12న రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.

ఇక కేవలం 50% ఆక్యుపెన్సీతో సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయనే విషయంలో అనేక రకాల అనుమానాలను క్రియేట్ అయ్యాయి. పైగా విడుదలైన రోజే ప్లాప్ టాక్ దెబ్బ పడినట్లు టాక్ వచ్చింది. రివ్యూలు కూడా చాలా వరకు నెగిటివ్ గానే వచ్చాయి. అయితే ఆ టాక్ తో సంబంధం లేకుండా సినిమా వరల్డ్ వైడ్ గా 150కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X