మాస్టర్ ట్విట్టర్ రివ్యూ: అనుకున్నదొకటి అయిందొకటి.. విజయ్ కెరీర్‌లోనే.. సినిమాకు అదే మైనస్!
మిగిలిన దక్షిణాది హీరోలతో పోలిస్తే.. తన ప్రత్యేకతను చూపిస్తూ టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు కోలీవుడ్ స్టార్ ఇళయదళపతి విజయ్. విభిన్నమైన చిత్రాలతో, విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అతడు.. అన్ని ప్రాంతాల్లోనూ మార్కెట్‌ను పెంచుకుని దూసుకుపోతోన్నాడు. ఇక, కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటూ సత్తా చాటుతోన్న విజయ్.. తాజాగా 'మాస్టర్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో షోలు కూడా పడిపోయాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులు ఇచ్చిన రివ్యూ మీకోసం!

మాస్టర్ వెనుక అసలు ఉన్నదెవరంటే
'ఖైదీ' ఫేం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన చిత్రం 'మాస్టర్'. కాలేజ్ పొలిటికల్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీలో మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. మాలవిక మోహనన్ హీరోయిన్. అర్జున్ దాస్, ఆండ్రియా కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమాను ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్ బ్యానర్‌పై స్కేవియర్ బ్రిట్టో నిర్మించారు.

అన్ని చోట్లా షోలు.. తెలుగులో రికార్డు
'మాస్టర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, మలేషియా, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ఇండియాలో చాలా రాష్ట్రాల్లో విడుదల కాబోతుంది. మరీ ముఖ్యంగా తెలుగులో దాదాపు 650 థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంత భారీ సంఖ్యలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తొలి డబ్బింగ్ సినిమాగా 'మాస్టర్' రికార్డు క్రియేట్ చేసింది.

దర్శకుడిదే అంతా.. విజయ్ కెరీర్‌లోనే
ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 'మాస్టర్' ప్రీమియర్, బెనిఫిట్ షోలు పడిపోయాయి. సినిమా చూసిన వాళ్లంతా అద్భుతంగా ఉందని అంటున్నారు. మరీ ముఖ్యంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు బాగుందని వెల్లడిస్తున్నారు. 'ఖైదీ' తర్వాత అతడు మరో మాయ చేశాడని చెబుతున్నారు. మొత్తంగా ఈ మూవీ విజయ్ కెరీర్‌లోనే బెస్ట్ అని వివరిస్తున్నారు.

అనుకున్నదొకటి అయిందొకటి.. కొత్తగా
విజయ్ అంటేనే ప్యూర్ మాస్ సినిమాతో వస్తాడని అని అంతా అనుకుంటున్నారు. కానీ, 'మాస్టర్'లో చాలా వరకూ అతడు డిఫరెంట్‌గా కనిపించాడట. హీరో ఎలివేషన్ సీన్స్ అద్భుతంగా ఉన్నా.. విజయ్ డీసెంట్ లుక్‌లో నటించి కొంత నిరాశ పరిచాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కొత్తగా ట్రై చేసినా.. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాన్స్ సీన్లలో అదరగొడుందని టాక్.

అతడి విశ్వరూపం.. తీసిపోని విధంగా
ఇక, ఈ సినిమాలో విలన్‌గా నటించింది మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి. అతడు చేసిన పాత్ర హీరోకు సమానంగా ఉంటుందట. భవాని అనే క్యారెక్టర్‌లో అతడు రెచ్చిపోయి మరీ నటించాడని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో విశ్వరూపం ప్రదర్శించాడని అంటున్నారు. దర్శకుడు అతడి క్యారెక్టర్‌ను బాగానే హైలైట్ చేశాడని సినిమా చూసిన వాళ్లంతా పేర్కొంటున్నారు.

సిల్వ.. అనిరుథ్.. కెరీర్‌లోనే బెస్టుగా
'మాస్టర్' సినిమా చూసిన వాళ్లంతా ఫైట్ మాస్టర్ సిల్వ చేసిన స్టంట్స్ గురించే మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా విజయ్ ఇంట్రడక్షన్ ఫైట్, ఇంటర్వెల్ బ్యాంగ్, విజయ్ సేతుపతితో చేసే పోరాట సన్నివేశం హైలైట్ అని అంటున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్ కూడా మెప్పించాడని చెబుతున్నాడు. మరీ ముఖ్యంగా హీరో, విలన్ బ్యాగ్రౌండ్ స్కోర్స్ అదరగొట్టాడని టాక్.

విజయ్ మాస్టర్ సినిమాకు మైనస్ అదే
సినిమా ఫస్ట్ ఆఫ్ మొత్తం ఆసక్తికరంగా సాగుతుందని, ఇంటర్వెల్‌లో 'తుపాకీ' (విజయ్ సినిమా)ని పోలిన ట్విస్టులు ఉంటాయని అంటున్నారు. అయితే, సెకెండాఫ్ మాత్రం సాగతీతగా ఉంటుందని, కొన్ని సన్నివేశాలు మాత్రం బోరింగ్‌గా ఉన్నాయని చెబుతున్నారు. మొత్తంగా ఈ విజయ్ 'మాస్టర్' మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ.. రన్ టైమ్ మాత్రం సినిమాకు మైనస్ అనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











