ఫ్యాన్స్ అభిమానమే నా ఆయుష్షు.. దాసరి షాక్ తిన్నారు.. ఘనంగా విజయనిర్మల బర్త్ డే

ప్రముఖ నటి, నిర్మాత, అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించిన శ్రీమతి విజయనిర్మల 74వ పుట్టినరోజు వేడుకలు ఫిబ్రవరి 20న హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలోని ఆమె నివాసంలో దేశం నలుమూలల నుండి వచ్చిన అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీమతి విజయనిర్మల పుట్టినరోజు కేక్‌ను కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ కృష్ణ, సీనియర్‌ నటి జయసుధ, నటుడు నరేష్‌, నిర్మాత శాఖమూరి మల్లికార్జునరావు, నిర్మాత బి.ఎ. రాజు, 'మా' అధ్యక్షుడు శివాజీరాజా, నిర్మాత సురేష్‌ కొండేటి, నటి గీతా సింగ్‌ పాల్గొని శ్రీమతి విజయనిర్మలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ కృష్ణ మహేష్‌ సేన జాతీయ అద్యక్షులు దుడ్డి రాంబాబు, ప్రధాన కార్యదర్శి టి.మల్లేష్‌, ఆల్‌ ఇండియా కృష్ణ మహేష్‌ ప్రజాసేన అద్యక్షులు ఖాదర్‌ గోరి తదితరులు పాల్గ్గొన్నారు.

 ఇప్పటి వరకు ఎవ్వరూ ఇవ్వని విధంగా విరాళం

ఇప్పటి వరకు ఎవ్వరూ ఇవ్వని విధంగా విరాళం

ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ కృష్ణ మాట్లాడుతూ... విజయనిర్మలగారు 'మా' అసోసియేషన్‌ను ప్రాణంగా చూసుకుంటూ ప్రతీ ఏడాది స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు ఇంతవరకూ ఎవ్వరూ ఇవ్వని విధంగా డొనేషన్‌ ఇచ్చారు. ఇదంతా అభిమానుల అభిమానం వల్లే అని గర్వంగా భావిస్తున్నా. మేమింత సంతోషంగా ఉండగలుగుతున్నామంటే ఫ్యాన్స్ వల్లే. విజయనిర్మల ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

 అభిమానమే ఆయుష్షు

అభిమానమే ఆయుష్షు

శ్రీమతి విజయనిర్మల మాట్లాడుతూ.. నలుమూలల నుంచి వచ్చిన అభిమానులందరికీ నా కృతజ్ఞతలు. మీ అభిమానమే నా ఆయుష్షు. ఒక సందర్భంలో దాసరి నారాయణరావుగారు 'మీరు సినిమాలు మానేసి చాలాకాలం అయ్యింది కదా! అయినా ఇంతమంది అభిమానులు మీ పుట్టినరోజు వేడుకల్ని ఇంత ఘనంగా ఎలా నిర్వహిస్తున్నారు' అని నన్ను అడిగారు..

దాసరిగారు అలా షాక్ తిన్నారు

దాసరిగారు అలా షాక్ తిన్నారు

ఓ ఏడాది జరిగిన నా పుట్టినరోజు వేడుకలకు దాసరిగారు కూడా హాజరై నలుమూలల నుంచి వచ్చిన అభిమానులను చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు నేను ఆయనకి చెప్పాను. 'వాళ్ళకు నా మీద ఉన్న అభిమానం, నాకు వాళ్ళ మీద ఉన్న అభిమానంతోనే అంతమంది అభిమానులు వచ్చారు' అన్నాను. మీ అందరి మధ్య నా పుట్టినరోజు వేడులు జరుపుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది అని విజయ నిర్మల అన్నారు.

74 ఏటా రూ.74 వేల విరాళం

74 ఏటా రూ.74 వేల విరాళం

సీనియర్‌ నటుడు, విజయ నిర్మల కుమారుడు నరేష్‌ మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి, 'మా' అసోసియేషన్‌ నుండి ఆదర్శ దంపతులను దీవించడానికి వచ్చిన అభిమానులకు నా ధన్యవాదాలు. విజయనిర్మలగారు 'మా' అసోసియేషన్‌పై ఎంతో ప్రేమతో ప్రతి నెలా రూ. 15,000, 'మా' కళ్యాణలక్ష్మి పథకానికి రూ.లక్ష ఇస్తూ వస్తున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం తన 74వ పుట్టినరోజు సందర్భంగా రూ. 74,000 అసోసియేషన్‌కు అందజేశారు అని అన్నారు.

పుల్వామా బాధితులకు రూ. లక్ష విరాళం

పుల్వామా బాధితులకు రూ. లక్ష విరాళం

ఇటీవల పుల్వామా ఘటనలో మరణించిన వీర సైనికుల కుటుంబాలకు మా కుటుంబం తరపున లక్ష రూపాయలను చెక్కు రూపంలో పంపడం జరిగింది. ప్రతి సంవత్సరం ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ తనవంతు సహాయ సహకారాలను అందిస్తున్న విజయనిర్మలగారు ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని నరేష్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X