twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహిళల పట్ల ఇలాగేనా?..... అభిమానుల తీరుపై విజయ్ అసహనం!

    అభిమానుల తీరును తమిళ స్టార్ విజయ్ తప్పుబట్టారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడాన్ని ఖండించారు.

    By Bojja Kumar
    |

    బెంగుళూరు జర్నలిస్ట్ ధన్య రాజేంద్రన్, తమిళ స్టార్ విజయ్ అభిమానుల మధ్య చెలరేగిన వివాదం పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. విజయ్ అభిమానులు ట్విట్టర్లో 63 వేల ట్వీట్లతో అసభ్య పదజాలం ఉపయోగించి దాడి చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.

    ధన్యపై దూషణకి దిగిన నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ పరిణామాలపై విజయ్ స్పందించారు. దారి తప్పి ప్రవర్తించిన అభిమానులను దారిలో పెట్టే ప్రయత్నం చేశారు.

    విజయ్ స్పందన

    విజయ్ స్పందన

    ఈ వివాదంపై విజయ్ తాజాగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. స్త్రీలంటే తనకు ఎంతో గౌరవమని, వారి గురించి తప్పుగా మాట్లాడటాన్ని, తప్పుడుగా ప్రవర్తించడాన్ని తాను ఎప్పుడూ సహించను, ఇలాంటి పనులు చేసే వారు నా అభిమానులైనా, ఇంకెవరైనా ఊపేక్షంచబోనని విజయ్ స్పష్టం చేశారు.

    Recommended Video

    Pelli Choopulu Fame Vijay Devarakonda's Arjun Reddy Movie Trailer Out
    ఆ హక్కు అందరికీ ఉంది

    ఆ హక్కు అందరికీ ఉంది

    ఏ సినిమానైనా విమర్శించే హక్కు, తమ అభిప్రాయం వెల్లడించే హక్కు అందరికీ ఉంది.... అంటూ ధన్య రాజేంద్రన్ కు మద్దతుగా నిలించారు విజయ్.

    ఇదీ వివాదం

    ఇదీ వివాదం

    బెంగుళూరు జర్నలిస్ట్ ధన్య రాజేంద్రన్ ఇటీవల షారూఖ్ నటించిన ‘జబ్ హ్యరీ మెట్ సెజల్' అనే చిత్ర చూసిన తర్వాత ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... షారుక్ మూవీ విజయ్ ‘సురా' కంటే చెత్తగా ఉంది. ‘సురా' మూవీకి ఇంటర్వెల్ వరకు కూర్చోగలిగాను, కాని షారూఖ్ ‘జబ్ హ్యరీ మెట్ సెజల్' ఇంటర్వెల్ వరకు కూడా నన్ను కూర్చోబెట్టలేకపోయింది అని ట్వీట్ చేశారు.

    63 వేల ట్వీట్లు

    63 వేల ట్వీట్లు

    జర్నలిస్ట్ ధన్య రాజేంద్రన్ ట్వీట్ చూసి ఆగ్రహానికి గురైన విజయ్ అభిమానులు....ఆమెపై ట్విట్టర్ దాడి చేశారు. ఆమెను దూషిస్తూ దాదాపు 63 వేల ట్వీట్లు చేశారు. మూడు రోజుల పాటు ఆమెకు నరకం చూపించారు.

    పోలీసులు

    పోలీసులు

    విజయ్ అభిమానుల దాడిని తట్టుకోలేక ఆమె పోలీసులని ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా, అనుమానితులుగా వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

    English summary
    Vijay has sent a message to his fans not to abuse women while claiming that people have the right to criticise a film. His reaction comes after a woman journalist was trolled with demeaning posts by his fans on social media for making negative comments on his movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X