తమిళంలో 120 కోట్లు తెచ్చింది..మరి తెలుగులో

By Srikanya

హైదరాబాద్ :విజయ్‌, మోహన్‌లాల్‌, కాజల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం 'జిల్లా'. ఆర్‌.టి.నేసన్‌ దర్శకత్వం వహించారు. సూపర్‌గుడ్‌ ఫిలింస్‌, శ్రీఓబులేశ్వర పొడక్షన్స్‌ సంస్థలు తెలుగులోకి అనువదిస్తున్నాయి. తమిళంలో ఈ చిత్రం ఇప్పటివరకూ 120 కోట్లు వసూలు చేసిందని నిర్మాతలు చెప్తున్నారు. మరి ఈ స్ధాయి చిత్రం తెలుగులో ఎంత వసూలు చేయాలో...చూడాలి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నిర్మాతలు తమటం కుమార్‌రెడ్డి, ప్రసాద్‌ సన్నిధి మాట్లాడుతూ ''తమిళంలో రూ.120 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రమిది. విజయ్‌ కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. మా మీద నమ్మకంతో మాతో కలిసి సినిమాని తెలుగులో విడుదల చేసేందుకు ముందుకొచ్చారు ఆర్‌.బి.చౌదరి. తెలుగు ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకొని బ్రహ్మానందం, ఎల్‌.బి.శ్రీరాం, సురేఖావాణి తదితరులపై ప్రత్యేకంగా కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించాం. త్వరలో తెలుగులో సినిమా పేరును ప్రకటిస్తాం''అన్నారు.

Vijay's Jilla dubbing latest info.

ఇక ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తారంటూ చాలా కాలంగా వార్తలు వినిపించాయి. బాలకృష్ణ,కళ్యాణ్ రామ్ లతో రీమేక్ చేస్తారని,చిరంజీవి ఆసక్తి చూపిస్తున్నారని, రవితేజ-వెంకటేష్ కాంబినేషన్ ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. ముఖ్యంగా బాలకృష్ణతో ఫైనల్ అయినట్లే అని చెప్పుకున్నారు.

బాలకృష్ణ స్పెషల్ స్క్రీనింగ్ చూసి మార్పులు చెప్పారని అన్నారు. అయితే ఇప్పుడు అలాంటిదేమీ లేదని డబ్బింగ్ చేసి విడుదల చేయటానికి సిద్దం చేస్తున్నారు. అంతేకాదు డబ్బింగ్ వెర్షన్ కోసం బ్రహ్మానందంపై కామెడీ ట్రాక్ తీసి కలిపి వదల నున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Vijay's Jilla dubbing latest info.

నామన శంకర్‌రావు సహ నిర్మాత. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌, ప్రదీప్‌ రావత్‌, సంపత్‌రాజ్‌ కీలక పాత్రధారులైన ఈ చిత్రానికి ఆర్‌.టి. నేసన్‌ దర్శకుడు. ఆర్‌.బి. చౌదరి తనయుడు జీవా ఇందులో ప్రత్యేక అతిథి పాత్ర పోషించడం విశేషం. తమిళనాట కాసుల వర్షం కురిపించి, విజయ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్నీ అమితంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది అంటున్నారు.

మహత్‌ రాఘవేంద్ర, నివేదా థామస్‌, సూరి, పూర్ణిమా భాగ్యరాజ్‌, ప్రదీప్‌ రావత్‌, సంపత్‌ రాజ్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: గణేష్‌ రాజవేలు, సంగీతం: డి.ఇమాన్‌, పాటలు: వెన్నెలకంటి, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, సమర్పణ: ఆర్‌.బి.చౌదరి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X