»   » ఓ వైపు స్టార్ వార్: విజయ్ తల్లి నుండి అజిత్‌కు రిక్వెస్ట్!

ఓ వైపు స్టార్ వార్: విజయ్ తల్లి నుండి అజిత్‌కు రిక్వెస్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు అజిత్ మే 1న తన 45వ పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. అభిమానుల సమక్షంలో తమిళనాడు వ్యాప్తంగా అజిత్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఇతర సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా అజిత్‌కు విషెస్‌తో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేకమైన వ్యక్తి నుండి నుండి అజిత్ కు పెట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. ఆమె వరెవరో కాదు తమిళ స్టార్ విజయ్ తల్లి శోభ చంద్రశేఖర్.

తమిళ సినీ పరిశ్రమలో విజయ్, అజిత్ మధ్య స్టార్ వార్ నడుస్తోంది. పరిశ్రమలో నెం.1 స్థానం కోసం ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఇలాంటి తరుణంలో విజయ్ తల్లి శోభ నుండి అజిత్‌కు శుభాకాంక్షలు అందడంతో అంతా ఆశ్చర్య పోతున్నారు. ఓ వీడియో మెసేజ్ ద్వారా ఆమె అజిత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. అయితే ఆమె శుభకాంక్షలతో పాటు ఓ విన్నపం కూడా చేయడం గమనార్మం.

Vijay's Mother Shoba Requests Thala Ajith

'హలో అజిత్...మెనీ మెనీ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే. మీ సినిమాల్లో మీరు కొన్ని స్టంట్ సీన్ల విషయంలో చాలా రిస్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో గాయాలపాలై ట్రీట్మెంట్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి చూసి తల్లిగా నా మనసు చాలా బాధకు గురవుతోంది. ప్లీజ్ ఇకపై అలాంటి రిస్క్ సీన్లు చేయవద్దు. మీరు ఉప్పటికీ ఆరోగ్యంగా, మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలి' అంటూ శోభ వీడియో మెసేజ్ ద్వారా విషెస్ తెలిపారు.

తమిళ సినీ పరిశ్రమలో ఈ ఇద్దరు హీరోల మధ్య పోటీ వాతావరణం నెలకొని ఉంది. సినిమాల సంగతి పక్కన పెడితే నిజ జీవితంలో ఈ ఇద్దరు స్టార్లు మంచి స్నేహితులు. అయితే ఈ ఇద్దరు స్టార్ల అభిమానుల మధ్య సరైన సంబంధాలు లేవు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ గొడవ పడుతూ ఉంటారు. పలు సందర్భాల్లో ఈ గొడవలు సీరియస్‌గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో విజయ్ తల్లి శోభ మెసేజ్ ఇద్దరు అభిమానుల మధ్య మంచి వాతావరణం నెలకొనడానికి తోడ్పడుతుందని భావిస్తున్నారు.

English summary
We all know Thala Ajith celebrated his 45th birthday on May 1st (Sunday). Though many celebrities and fans wished him on the special day through various social media platforms and other means of communication, one particular wish stood out, for it came from Ilayathalapathy Vijay's mother.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu