twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెర్సల్ రికార్డుల సునామీ.. కబాలి, విశ్వరూపం రికార్డులు బ్రేక్

    వివాదాలు ఓ వైపు కొనసాగుతుండగా మరో వైపు మెర్సల్ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ చిత్రం కలెక్షన్ల రికార్డుల మోత మోగిస్తున్నది.

    By Rajababu
    |

    వివాదాలు ఓ వైపు కొనసాగుతుండగా మరో వైపు మెర్సల్ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ చిత్రం కలెక్షన్ల రికార్డుల మోత మోగిస్తున్నది. తొలివారం భారీ వసూళ్లను సాధించిన ఈ చిత్రం రెండో వారంలో కూడా అదే జైత్రయాత్రను కొనసాగిసున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    12 రోజుల్లో 210 కోట్లు వసూలు

    12 రోజుల్లో 210 కోట్లు వసూలు

    గత 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మెర్సల్ చిత్రం రూ.210 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. నికరంగా చూసుకొంటే 103 (షేర్) కోట్ల రూపాయలను సాధించింది. ఇది విజయ్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్ అని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.

    దక్షిణాదిలో 6వ స్థానం

    దక్షిణాదిలో 6వ స్థానం

    భారీ రికార్డులను వసూలు చేస్తున్న మెర్సల్ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో దక్షిణాదిలో 6వ స్థానంలో నిలిచింది. ఇక కోలీవుడ్‌లో 4వ స్థానాన్ని ఆక్రమించింది.

    కబాలి రికార్డులు బ్రేక్

    కబాలి రికార్డులు బ్రేక్

    గతంలో కోలీవుడ్‌లో విశ్వరూపం, కబాలీ, రోబో చిత్రాల పేరిట ఉన్న రికార్డులను తిరుగరాస్తున్నది. జీఎస్టీ, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తుతూ తీసిన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ దక్కుతున్నది.

    రాష్ట్రాల వారీగా కలెక్షన్లు

    రాష్ట్రాల వారీగా కలెక్షన్లు

    రాష్ట్రాల వారీగా కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. తమిళనాడులో 57.4 కోట్లు (105 కోట్లు గ్రాస్), కర్ణాటకలో 6.1 కోట్లు (19 కోట్లు గ్రాస్), కేరళలో 6.3 కోట్లు (14 కోట్లు గ్రాస్) వసూళు చేసింది. మిగితా రాష్ట్రాల్లో 1.1 కోట్లు వసూలు చేసింది. టోటల్‌గా ఇండియాలో 71 కోట్లు ఈ చిత్రం రాబట్టింది.

    ఓవర్సీస్ మార్కెట్‌లో

    ఓవర్సీస్ మార్కెట్‌లో

    ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా మెర్సల్ రికార్డుల దుమ్ము దులుపుతున్నది. మలేషియాలో 10 కోట్లు, అమెరికా, కెనడాలో 5.5 కోట్లు, యూఏఈలో 6.4 కోట్లు, సింగపూర్‌లో 3 కోట్లు, శ్రీలంకలో 2 కోట్లు, బ్రిటన్‌లో 2 కోట్లు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కోటి, మిగితా దేశాల్లో 2 కోట్లు వసూలు చేపట్టింది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం 103 కోట్ల షేర్ సాధించినట్టు ట్రేడ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

    English summary
    Thalapathy Vijay's Mersal has been making waves at the national as well as the international box office. It has surpassed records held by Vishwaroopam in the US, Kabali in the UK and is very close to breaking Enthiran's record in Malaysia. Mersal's official handle tweeted that the movie has now made Rs 210.5 crore approximately worldwide in just 12 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X