Don't Miss!
- News సీఎం ఏటీఎం కార్డు అయ్యాడు, అందుకే టూర్లు వేస్తున్నారు, ఎంతకావాలంటే అంత డబ్బులు !
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విడుదలకు ముందే విజయ్ సెన్సేషన్.. ఓ రేంజ్ ప్రీ రిలీజ్ మార్కెట్! ఇదీ పరిస్థితి
కోలీవుడ్‌లో ఇళయ దళపతి విజయ్ మార్కెట్ అంతా ఇంతా అని చెప్పలేం. స్టార్ హీరోగా వెలుగొందుతున్న ఆయన సినిమాలకు యమ డిమాండ్ ఉంటుంది. తమిళనాట ఆయనకు అంతులేని ఫాలోయింగ్ ఉంటుంది. కోలీవుడ్‌లో సత్తా చాటుతూనే క్రమంగా టాలీవుడ్ లోనూ తన మార్కెట్ పెంచుకున్నాడు హీరో విజయ్. ఈ క్రమంలోనే ఆయన తాజా సినిమా 'విజిల్'పై భారీ అంచనాలు పెట్టుకున్నారు తెలుగు ప్రజలు. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డే మార్కెట్ గురించి, ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర వివరాలు బయటకొచ్చాయి.
వరుస విజయాలు.. తెలుగు ప్రజల కన్ను
తేరి, మెర్సెల్, సర్కార్ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ తెలుగు ప్రేక్షకుల చూపును ఆకర్షించాడు. దీంతో ఆయన సినిమాలకు టాలీవుడ్లో డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే విజయ్ తాజా సినిమా 'విజిల్' విడుదల రోజే తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త సంచలనాలకు తెరలేపుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
కోలీవుడ్‌లో ఆ పేరు.. టాలీవుడ్లో ఈ పేరు
తేరీ, మెర్సెస్ లాంటి సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన అట్లీ.. విజయ్‌తో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సిద్దమయ్యాడు. ఈ మేరకు బిగిల్ సినిమాను రూపొందించారు. ఇదే సినిమా తెలుగులో 'విజిల్' పేరుతో విడుదల కానుంది. అక్టోబర్ 25న విడుదల కానున్న ఈ సినిమాపై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ హైప్ నెలకొంది.
ఓ రేంజ్లో ప్రీ రిలీజ్ మార్కెట్
విజయ్ 'విజిల్' సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఓ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా థియాట్రికల్ రైట్స్ కలిపి 9.75 కోట్ల రూపాయలకు అమ్ముడు కావడం విశేషం.
ప్రీ రిలీజ్ బిజినెస్.. ఏయే ఏరియాల్లో ఎంతెంత?
విజిల్ సినిమా నమోదు చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియా వైస్ చూస్తే.. నైజాం 3 కోట్లు, సీడెడ్ 2.25 కోట్లు, ఆంధ్రా 4.5 కోట్లు నమోదు చేసి మొత్తంగా 9.75 కోట్ల రూపాయల మార్క్ నెలకొల్పింది. తెలుగులో విజయ్ కెరీర్లో ఇప్పటిదాకా ఇదే అతిపెద్ద ప్రీ రిలీజ్ బిజినెస్ అంటున్నారు ట్రేడ్ పండితులు.
విడుదల రోజే.. పరిస్థితి ఎలా ఉంటుందంటే
ఇప్పటివరకు విజిల్ సినిమా క్రేజ్, వస్తున్న అప్డేట్స్ చూసి.. ఈ సినిమా విడుదల రోజే 3 కోట్ల మార్క్ దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో విజయ్ క్రేజ్ ఓ రేంజ్లో పెరిగి పోతుందనడంలో అతిశయోక్తి లేదు.
విజిల్ మూవీ.. విజయ్ క్యారెక్టర్
అట్లీ డైరెక్షన్లో తెరకెక్కిన విజిల్ సినిమాలో విజయ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఫుట్‌బాల్ కోచ్‌గా కాస్త క్లాస్ లుక్‌లో కనిపించే ఓ పాత్ర, మాంసం వ్యాపారిగానూ ఫుల్ మాస్ యాంగిల్లో మరో పాత్రలో కనిపించి ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు విజయ్. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్పై నిర్మించిన ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు.