For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డాడీ ఎవరినీ విడిచిపెట్టొదు.. శిక్ష పడాలి... లవ్‌ యూ డాడీ.. విజయ్ సెల్ఫీ వీడియో

  By Rajababu
  |
  ఎవ్వరినీ విడిచిపెట్టొదు.. శిక్ష పడాలి..! విజయ్ సెల్ఫీ వీడియో

  సినీ నటుడు విజయ్‌ సాయి ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. తొలుత సినీ అవకాశాలు లేకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులకు లోనవ్వడమే ఆయన సూసైడ్ కారణమని అంతా భావించారు. కానీ భార్య, మరికొందరి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకొన్నట్టు సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడి కావడంతో ఈ కేసు మరింత వివాదంగా మారింది.

  ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు విజయ్‌సాయి సెల్‌ఫోన్‌లో తీసుకున్న సెల్ఫీ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ యూసఫ్‌గూడలోని తన నివాసంలో సోమవారం విజయ్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. విజయ్‌ ఆత్మహత్య ఘటనపై సినీ నటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పలువురు నటులు విజయ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి తమతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

  అసలు జరిగిందేమిటీ?

  అసలు జరిగిందేమిటీ?

  రెండేళ్లుగా విజయ్‌ ఆయన భార్య వనిత అలియాస్‌ వరలక్ష్మి అలియాస్‌ విన్నితో గొడవలు జరుగుతున్నాయి. విడివిడిగా జీవిస్తున్న వీరి విడాకుల కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. వీరి కుమార్తె కుందన కోర్టు ఆదేశాల మేరకు నిర్ణీత సమయం తండ్రితో ఉంటున్నది. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో విజయ్‌ను కలవడానికి ఆయన స్నేహితుడు సాయి వచ్చారు. ఈ నేపథ్యంలో వరలక్ష్మమ్మ అల్పాహారం సిద్ధం చేస్తుండగా.. స్నానం చేసి వస్తానంటూ విజయ్‌ బెడ్‌రూంలోకి వెళ్లాడు.

   బాత్రూంలోకి వెళ్లి రాకపోయే..

  బాత్రూంలోకి వెళ్లి రాకపోయే..

  విజయ్ బాత్రూంలోకి వెళ్లి దాదాపు గంట కావస్తున్నా అతడు బయటకు రాకపోవడంతో స్నేహితుడు సాయితో పాటు తల్లి బెడ్‌రూమ్‌ వద్దకు వెళ్లి పలుమార్లు విజయ్‌ని పిలిచారు. ఎలాంటి స్పందనా లేకపోవడంతో తలుపులు పగలగొట్టి లోపలకు ప్రవేశించగా.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతున్న స్థితిలో విజయ్‌ కనిపించారు. వెంటనే కిందకు దింపి చూడగా అప్పటికే విజయ్‌ మరణించినట్లు గుర్తించారు.

  విజయ్ సెల్ఫీ వీడియోలో

  విజయ్ సెల్ఫీ వీడియోలో

  పరువు, మానసిక వేదనతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు విజయ్‌ వీడియోలో పేర్కొన్నట్టు తెలుస్తున్నది. భార్య వనిత ప్రవర్తన, ఇతరుల వేధింపుల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా చావుకు భార్య వనిత, వరలక్ష్మి, విన్నీ, బృందతోపాటు పారిశ్రామికవేత్త శశిధర్‌, న్యాయవాది శ్రీనివాస్‌ కారణం. వీరంతా తనను మానసికంగా హింసించారు అని వీడియోలో విజయ్ పేర్కొన్నట్టు సమాచారం.

   వనితను వదులొద్దు

  వనితను వదులొద్దు

  వనితకు గతంలోనే అమ్మిరెడ్డి అనే వ్యక్తితో పెళ్ళైందిజ ఆమెతో పాటు ఆమె తల్లి సైతం వ్యభిచారం చేసే వారు. ఈ విషయం వారి సొంతూరు వెళ్లినప్పుడు తెలిసింది. ఇలాంటి వారి వల్ల సమాజం చాలా ఇబ్బంది పడుతుందని, వనిత లాంటి వారిని వదలొద్దు అని విజయ్ వీడియోలో పేర్కొన్నారు.

  కూతురికి దూరంగా పెడుతున్నారు..

  కూతురికి దూరంగా పెడుతున్నారు..

  భార్య వనిత తన కూతురిని కూడా చూడనివ్వడం లేదు. తనకు సంబంధించిన కొన్ని వీడియోలు ఉన్నాయి. అవి బయటపెడుతానని బెదిరించిన అడ్వొకేట్‌ శ్రీను రూ.3 కోట్లు డిమాండ్‌ చేశారు. వీరంతా తనను తీవ్రస్థాయిలో మానసికంగా హింసించారు అని విజయ్ వెల్లడించినట్టు సమాచారం.

   ఎవరినీ విడిచిపెట్టొద్దు

  ఎవరినీ విడిచిపెట్టొద్దు

  డాడీ.. ఈ వ్యవహారంలో ఎవరినీ విడిచిపెట్టొదు. అందరికీ శిక్ష పడేలా చూడు.. లవ్‌ యూ డాడీ.. నా కూతురు అలాంటి వాతావరణంలో పెరగడం నాకు ఇష్టంలేదు. చనిపోవడం కష్టంగా ఉన్నప్పటికీ తప్పట్లేదు. నా కూతురిని అక్కడ నుంచి తీసుకొని రండి డాడీ' అని విజయ్‌ సాయి సెల్ఫీ వీడియోలో వెల్లడించినట్టు తెలుస్తున్నది.

  ఎందుకు ఆత్మహత్య..

  ఎందుకు ఆత్మహత్య..

  తన భర్త విజయ్‌సాయికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో తనకు తెలియదు. విజయ్‌కి వేరే మహిళతో సంబంధం ఉంది. నేను కళ్లతో ప్రత్యక్షంగా చూశాను. అప్పటి నుంచే మా మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఆయన తల్లిదండ్రులు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదు. రెండేళ్లుగా కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. సూసైడ్‌ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు తెలియదు అని భార్య వనిత మీడియాకు తెలిపారు.

  కూతురి విషయంలో జోక్యం చేసుకోలేదు..

  కూతురి విషయంలో జోక్యం చేసుకోలేదు..

  కూతురు విషయంలో కూడా నేను ఎలాంటి జోక్యం చేసుకోలేదు. సమయం చిక్కినప్పుడల్లా కూతురిని తీసుకెళ్లి మళ్లీ తీసుకొస్తుండేవారు. అయితే పెళ్లి సమయంలో ఇచ్చిన కట్న కానుకలు ఇవ్వమని కోరాను. పాప భవిష్యత్‌ను కూడా నేను చూసుకోవాలి కదా అని వనిత వెల్లడించారు.

  English summary
  Vijay Sai recorded the Selfie video before suicide. In this video, Vijay Sai revealed some sensational details about his suicide. Vijay requested his dad to take this case seriously and make sure that everyone should punished seriouly.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X