For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆత్మహత్య ముందు నటుడు విజయ్ సాయి సెల్ఫీ వీడియో, ఏం చెప్పాడంటే...?

    By Bojja Kumar
    |
    ఆత్మహత్య ముందు విజయ్ సెల్ఫీ వీడియో.. ఏం చెప్పాడంటే...?

    ఆత్మహత్యకు పాల్పడ్డ సినీ నటుడు విజయ్ సాయి కేసు కొత్త మలుపు తిరిగింది. ఆత్మహత్యకు ముందు విజయ్ సాయి తాను ఎందుకు చనిపోతున్నానో కారణం తెలుపుతూ ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. ఈ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియోలో విజయ్ సాయి పలు సంచలన విషయాలు చెప్పినట్లు సమాచారం.

     భార్యతో పాటు మరో ఇద్దరి వేధింపులు

    భార్యతో పాటు మరో ఇద్దరి వేధింపులు

    ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన సెల్పీ వీడియోలో...... తన భార్యతో పాటు మరో ఇద్దరు తనను వేధింపులకు గురి చేసినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. వారి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో వివరించినట్లు సమాచారం.

    మూడు సంవత్సరాలుగా భార్యతో విడిగానే

    మూడు సంవత్సరాలుగా భార్యతో విడిగానే

    మూడు సంవత్సరాల నుండి భార్యతో గొడవలు ఉండటం వల్ల విడిగా ఉంటున్నానని, తాను యూసఫ్ గూడలో, ఆమె మణికొండలో ఉంటున్నట్లు విజయ్ సాయి ఆ వీడియోలో వెల్లడించినట్లు సమాచారం.

     రెండు కేసులు, భారీ మొత్తంలో డబ్బు డిమాండ్

    రెండు కేసులు, భారీ మొత్తంలో డబ్బు డిమాండ్

    విడాకులు కావాలని తన భార్య కేసు వేసిందని, దీంతో పాటు భరణం డిమాండ్ చేస్తూ మరో కేసు వేసిందని సెల్ఫీ వీడియోలో విజయ్ సాయి చెప్పినట్లు టీవీ చానల్స్ లో వార్తలు వస్తున్నాయి. ఈ రెండు కేసులు విత్ డ్రా చేసుకోవడానికి తన భార్య రూ. 3 కోట్లు ఇవ్వాలని మధ్యవర్తి ద్వారా వ్యవహారం నడిపినట్లు ... విజయ్ సాయి సెల్ఫీ వీడియోలో చెప్పినట్లు తెలుస్తోంది.

     విజయ్ సాయి వీడియోలో శశిధర్ అనే వ్యక్తి ప్రస్తావన

    విజయ్ సాయి వీడియోలో శశిధర్ అనే వ్యక్తి ప్రస్తావన

    భార్యకు, తనకు మధ్య జరుగుతున్న వివాదంలో శశిధర్ అనే వ్యక్తి జోక్యం కూడా ఎక్కువైందని, అతడితో పాటు అడ్వకేట్ కూడా తమను వేధింపులకు గురి చేశాడని విజయ్ సాయి సెల్పీ వీడియోలో వెల్లడించినట్లు సమాచారం.

     ఇంటికొచ్చి వస్తువులు, కారు తీసుకెళ్లడంతో మరింత వేధనకు

    ఇంటికొచ్చి వస్తువులు, కారు తీసుకెళ్లడంతో మరింత వేధనకు

    ఇంతటితో ఆగకుండా మూడు రోజుల క్రితం తన ఇంటికి వచ్చి వస్తువులు తీసుకెళ్లడంతో పాటు కారు కూడా తీసుకెళ్లడంతో తాను మరింత వేధనకు గురయ్యానని, అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు విజయ్ సాయి తన సెల్ఫీ డియోలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

    English summary
    Vijay Sai recorded the Selfie video before suicide. In this video, Vijay Sai revealed some sensational details about his suicide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X