సలార్ 'విలన్' రోల్.. క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి.. మళ్ళీ మొదలైన సస్పెన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా సలార్ అనే కొత్త సినిమాను సెట్స్ పైకి తెచ్చిన విషయం తెలిసిందే. KGF సినిమాతో తానేంటో నిరూపించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయనున్న ఆ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఇక సినిమా తెరపైకి ఎప్పుడు వస్తుందో గాని గాసిప్స్ తోనే అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఇక సినిమాలో విలన్ గా కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించే అవకాశం ఉన్నట్లు గతంలో చాలా రూమర్స్ వచ్చాయి. ఇక ఫైనల్ గా సేతుపతి ఆ రూమర్స్ పై స్పందించినట్లు తెలుస్తోంది.
మరింత గ్లామర్‌గా శృతి హాసన్.. క్రాక్ విజయంతో మరింత జోష్‌గా

ముందుగా ఆ సినిమాతో..
ప్రభాస్ ఇప్పటికే మూడు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇక సినిమాలను ఎప్పుడు పూర్తి చేస్తాడనే విషయంపై ఇంకా ఎవరికి క్లారిటీ రావడం లేదు. రాధేశ్యామ్ రేపో మాపో పూర్తవుతుంది. ఇక మే నెలలో లేదా జూన్ లో రిలీజ్ చేయవచ్చని టాక్ వస్తోంది. జిల్ దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

సలార్ మహారాణి..
ఇక సలార్ విషయానికి వస్తే దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాను ఇదే ఏడాది పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. గురువారం శృతి హాసన్ 35వ పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానులకు హోంబల్ ప్రొడక్షన్ హౌజ్ వారు కిక్కిచ్చే అప్డేట్ ఇచ్చారు. మొత్తానికి సలార్ మహారాణి శృతి హాసన్ అని క్లారిటీ ఇచ్చేశారు.

క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి
అయితే సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి నటించనున్నట్లు రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ రూమర్స్ పై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇక విజయ్ సేతుపతి అయితే తన దగ్గరకు ఇంతవరకు అలాంటి ఆఫర్స్ ఏమి రాలేదని చెబుతున్నట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మాస్టర్ లో అతని పాత్ర క్లిక్కవ్వడంతో సలార్ లో కూడా అతన్నే విలన్ గా అనుకుంటున్నట్లు టాక్ వచ్చింది. కానీ సేతుపతి వద్దకు ఇంకా ఆ ఆఫర్ రాలేదని సమాచారం.

సలార్ సినిమా ఎప్పుడు రాబోతోందంటే..
పాన్ ఇండియా ప్రాజెక్ట్ సలార్ పై అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ అదే టీమ్ తో కలిసి చేస్తున్న సినిమా కాబట్టి యాక్షన్ డోస్ మామూలుగా ఉండదు. ఇక సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కేవలం రెండు నెలల్లోనే తన షూటింగ్ పార్ట్ ను ముగించుకునేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











