అమీర్ ఖాన్‌తో గొడవ.. లాల్ సింగ్ చద్దా నుంచి ఎందుకు తప్పుకొన్నానంటే.. విజయ్ సేతుపతి క్లారిటీ

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, సీక్రెట్ సూపర్ స్టార్ దర్శకుడు అద్వైత్ చందన్ డైరెక్షన్‌లో వస్తున్న లాల్ సింగ్ చద్దా చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారనే వార్త సినీ పరిశ్రమలో ఆసక్తిని రేపింది. కొద్ది రోజులపాటు షూటింగులో కూడా పాల్గొన్నట్టు సమాచారం. ఈ చిత్రం నుంచి అనూహ్యంగా విజయ్ సేతుపతి తప్పుకొన్నారనే వార్త వివాదంగా మారింది. లాల్ సింగ్ చద్దా సినిమా నుంచి ఎందుకు తప్పుకొన్నాననే విషయంపై విజయ్ సేతుపతి క్లారిటీ ఇస్తూ..

లాల్ సింగ్ చద్దాలో విజయ్ సేతుపతి

లాల్ సింగ్ చద్దాలో విజయ్ సేతుపతి

హాలీవుడ్‌లో సంచలన విజయం, ఆస్కార్ అవార్డులందుకొన్న ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్‌గా లాల్ సింగ్ చద్దా సినిమా తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతిని కీలక పాత్ర కోసం తీసుకొన్నారు. అయితే ఆయన శరీర బరువు పెరిగిపోయిందనే కారణంతో దర్శక, నిర్మాతలు విజయ్ సేతుపతిని ప్రాజెక్ట్‌ నుంచి తొలగించారనే వార్త మీడియాలో వైరల్ అయింది.

బరువు తగ్గకపోతే అంటూ విజయ్ సేతుపతిపై ఒత్తిడి

బరువు తగ్గకపోతే అంటూ విజయ్ సేతుపతిపై ఒత్తిడి

అయితే విజయ్ సేతుపతి బరువు పెరిగిపోవడంపై అమీర్ ఖాన్ అసంతృప్తిని వ్యక్తం చేశారట. ఆ సమయంలో బరువు తగ్గించుకోమని అమీర్ చెప్పడంతో విజయ్ సేతుపతి సానుకూలంగా స్పందించలేదట. నా శరీరం, మైండ్ నా కంట్రోల్‌లోనే ఉంది. నా శరీరాకృతి గురించి మీరు పట్టించుకోవద్దు. నేను ఎలా ఉంటానో అలా మీరు ఒప్పుకోవాలి అని విజయ్ సేతుపతి స్పష్టం చేశారట. దాంతో చిత్ర యూనిట్ సంతృప్తి చెందకపోవడంతో లాల్ సింగ్ చద్దా మూవీ నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవాల్సి వచ్చిందనే తాజా సమాచారం.

అమీర్ ఖాన్ గురించి విజయ్ సేతుపతి

అమీర్ ఖాన్ గురించి విజయ్ సేతుపతి

లాల్ సింగ్ చద్దా సినిమా నుంచి తప్పించారనే వార్తలపై విజయ్ సేతుపతి స్పందించారు. ఈ సినిమా కథ చెప్పడానికి అమీర్ ఖాన్ చెన్నైకి వచ్చారు. ఓ రోజంతా ఉండి నాకు కథను వినిపించారు. దర్శకుడు చందన్ అద్వైత్ నాకు కథ చెప్పలేదు. అమీర్ ఖాన్ అద్భుతంగా కథ చెప్పారు. దాంతో నేను ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నాను అని విజయ్ సేతుపతి చెప్పారు.

లాక్‌డౌన్‌తో గందరగోళం

లాక్‌డౌన్‌తో గందరగోళం

లాల్ సింగ్ చద్దా సినిమాను ఒప్పుకొన్న తర్వాత కోవిడ్‌తో లాక్‌డౌన్ వచ్చింది. ఆ తర్వాత నా డేట్స్ అంతా గందరగోళంగా మారిపోయాయి. ఏకంగా తెలుగులో ఐదు సినిమాలు చేయాల్సి వచ్చింది. దాంతో లాల్ సింగ్ చద్దాకు డేట్స్ కేటాయించలేకపోయాను. అందుకే నేను ఆ సినిమా చేయలేకపోయాను అని విజయ్ సేతుపతి తెలిపారు.

అమీర్ అతిథ్యం అద్భుతం అంటూ విజయ్ సేతుపతి

అమీర్ అతిథ్యం అద్భుతం అంటూ విజయ్ సేతుపతి

ఆ తర్వాత నేను రెండుసార్లు ముంబైకి వెళ్లాను. స్వయంగా అమీర్ ఖాన్ తన ఇంటికి ఆహ్వానించారు. అద్భుతమైన ఆతిథ్యాన్ని ఇచ్చారు. ఆయన చూపిన చొరవ, మర్యాదను నేను ఎప్పటికి మరిచిపోలేను. ఆయనతో భవిష్యత్‌లో నటించాలని ఉంది అంటూ అమీర్ ఖాన్‌పై విజయ్ సేతుపతి ప్రశంసలు కురిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X