For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విజయ్ చేతుల మీదుగా ‘అసలు ఏం జరిగిందంటే’ఫస్ట్ లుక్..

|

తమిళ నాట వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటుడు విజయ్ సేతుపతి. నటనకు ప్రాధాన్యమున్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్. అయితే క్షణం తీరిక లేకుండా ఉండే.. విజయ్ ఓ మూవీ ఫస్ట్ లుక్ ను లాంచ్ చేశాడు. దీంతో అందరి చూపు ఆ మూవీపై పడింది.

బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో మెప్పించిన మహేంద్రన్ హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్న లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం "అసలు ఏం జరిగిందంటే". సూపర్ స్టార్ రజినీకాంత్, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ తో వైవిధ్యమైన పాత్రల్లో నవ్వులు పండించాడు మహేంద్రన్. శ్రీనివాస్ బండారి దర్శకత్వంలో జి.ఎస్ ఫిల్మ్స్ బ్యానర్, నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

 Vijay Sethupathi Launches Asalu emJarigindhante Movie First Look

తమిళంలో అత్యంత బిజీ హీరోగా ఏన్నో అత్యద్భుతమైన పాత్రల్ని పోషించిన విజయ్ సేతుపతి ఇటీవలే మెగా స్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంలోనూ తనదైన శైలిలో మెప్పించిన సంగతి తెలిసిందే. అలాంటి వెర్సటైల్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి 'అసలు ఏం జరిగిందంటే' ఫస్ట్ లుక్ ని లాంచ్ చేయడం విశేషం.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనివాస్ బండారి మాట్లాడుతూ.... 'విజయ్ సేతుపతి గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మా 'అసలు ఏం జరిగిందంటే' చిత్రం ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసినందుకు మా యూనిట్ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బాలనటుడిగా ఎన్నో వందల చిత్రాల్లో మనల్ని ఎంటర్ టైన్ చేసిన మహేంద్రన్ నా దర్శకత్వంలో తెరకెక్కిన అసలు ఏం జరిగిందంటే చిత్రంతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అవుతుండడం సంతోషంగా ఉంది.

వైవిధ్యమైన ఈ లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ లో శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోణ్య కత్రిన్, హరితేజ, షఫి, ఫణి, షాని, కుమ్నన్ సేతురామన్, ప్రశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లక్షీస్ ఎన్టీఆర్ సినిమా లో ఎన్టీఆర్ గా చేసిన విజయ్ కుమార్ గారు ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. చరణ్ అర్జున్ అందించిన పాటలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. కర్ణ సినిమాటోగ్రఫీ విజువల్ బ్యూటీ తో నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా టీజర్ ను విడుదల చేస్తామ'ని అన్నారు.

English summary
Makkal Selvan Vijay Sethupathy Launches Asalu emJarigindhante Movie First Look. Child Artist Mahendran Acts As Hero In Asalu emJarigindhante Movie. Movie Unit Thanked Vijay To Launch Their Movie First Look.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more