ఉప్పెన కొత్త పోస్టర్.. కరోనాకు ప్రచారమేనా?
కరోనా వైరస్ ధాటికి ప్రపంచమొత్తం వణికిపోతోంది. ఎంతో మందిని పొట్టనబెట్టుకుంటున్న కరోనాకు విరుగుడు కనిపెట్టలేకపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది దీని బారిన పడగా.. వేలమందిని పొట్టనబెట్టుకుంది. మన దేశంలోనూ శరవేగంగా విస్తరిస్తూ.. భయబ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా దెబ్బకు దేశం మొత్తం 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు.
లాక్ డౌన్‌ను అందరూ విధిగా పాటించాలని, ఎవ్వరూ రోడ్లపైకి రావొద్దని ప్రభుత్వాలు ఆదేశించాయి. ఇంట్లోనే ఉండండి సురక్షితంగా ఉండండనే నినాదాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ మేరకు సినీ తారలు కూడా తమ వంతుగా బాధ్యతను నేరవేరుస్తూ.. కరోనాపై అవగాహనను కలిగిస్తున్నారు.

ఇంట్లోనే కాలు మీదు కాలు వేసుకని కూర్చొని దేశానికి సేవ చేసే అదృష్టం మళ్లీ మళ్లీ రాదు.. అందరూ ఇంట్లోనే ఉండండని ఎంతో మంది సెలెబ్రిటీలు సందేశాలిస్తున్న వేళ.. ఉప్పెన టీమ్ కూడా అలాంటిదే పరోక్షంగా చెప్పుకొచ్చింది. రాయణం పాత్రలో విజయ్ సేతుపతి లుక్ ఇది వరకే రిలీజ్ చేయగా తాజాగా మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే.. ఇంట్లోనే కాలు మీదు కాలు వేసుకుని కూర్చొండని చెప్పినట్టుగా ఉంది.


Click it and Unblock the Notifications











