»   » లేడీ గెటప్ అద్దిరింది: రఫ్ అండ్ టఫ్ హీరో అందాలభామ గెటప్ లో

లేడీ గెటప్ అద్దిరింది: రఫ్ అండ్ టఫ్ హీరో అందాలభామ గెటప్ లో

Posted By:
Subscribe to Filmibeat Telugu
Vijay sethupathi In Lady Getup లేడీ గెటప్ అదిరింది

చిన్న చిన్న పాత్రల చేసుకుంటూ అంచెలంచెలుగా తమిళనాట స్టార్‌డమ్ ను సంపాదించుకున్నాడు విజయ్ సేతుపతి. అతడితో నటించేందుకు కోలీవుడ్‌ అగ్ర హీరోయిన్లు కూడా పోటీపడుతుంటారు. విజయ్ సేతుపతి కోలీవుడ్ లో ఒక పాత్ర చేస్తున్నాడూ అంటే అది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఆట్టిట్యూడ్ తో ఉంటుంది.ఇది తమిళుల నమ్మకం.

కోలీవుడ్ లో కలకలం

కోలీవుడ్ లో కలకలం

విజయ్ సేతుపతి కెరీర్ లో ఫెయిల్యుర్స్ ఉండొచ్చుగాక కానీ విజయ్ ఎన్నుకునే పాత్రల్లో ఒక వైవిధ్యం ఉంటుందని ఒక అభిప్రాయం అక్కడివారందరిలో ఉంది. విజయ్ సేతుపతి ఓ చిత్రం చేస్తున్నాడంటే అందులో చాలా మ్యాటర్‌ ఉండి ఉంటుందని కోలీవుడ్ వర్గాలు బలంగా నమ్మతాయి.అలాంటిది ఇప్పుడు ఏకంగా విజయ్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడనే వార్త ఒక్క సారి కోలీవుడ్ లో కలకలం రేపింది...

96

96

ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సూపర్ డీలక్స్ ', ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇందులో విజయ్‌ సేతపతి ఓ లేడీ రోల్ చేస్తున్నాడు. ‘శిల్ప' అనే పాత్ర పోషిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా బయటికివచ్చింది.

శిల్ప అనే లేడీ క్యారెక్టర్‌

శిల్ప అనే లేడీ క్యారెక్టర్‌

షాకింగ్ గా వుందీలుక్, రఫ్‌ అండ్‌ టఫ్‌గా కనిపించే విజయ్‌ సేతుపతి లేడీ గెటప్‌ వేయడమేంటని ఈ వార్త బయటకి వచ్చినపుడు అనుకున్నారు. కానీ ఆ గెటప్‌లో విజయ్‌ ఫస్ట్‌లుక్‌ చూసిన వారు ఔరా అంటున్నారు. "సూపర్ డీలక్స్ " టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో శిల్ప అనే లేడీ క్యారెక్టర్‌ చేస్తున్నాడు.

తమిళ హీరోలు

తమిళ హీరోలు

విజయ్‌ సేతుపతి లేడీ గెటప్‌ ఇంటర్నెట్‌లో వైరల్‌ అయిపోయింది. లేడీ గెటప్స్‌ అనేవి ఒకప్పుడు కామన్‌ అయినా ఈమధ్య బాగా తగ్గాయి. కానీ రీసెంట్‌గా తమిళ హీరోలు విక్రమ్‌, శివకార్తికేయన్‌ లేడీ గెటప్స్‌ వేసి ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు విజయ్ కూడా అదే స్థాయిలో ఏ మాత్రం తగ్గకుండా అమ్మాయిలాగే కనిపిస్తూ ఉన్నాడు.

English summary
Aaranya Kaandam’ director Thiagarajan Kumararaja revealed that his second film has been titled as ‘Super Deluxe’ and unveiled the look of Vijay Sethupathi’s transgender role in the film, the actor’s character name in Super Deluxe is Shilpa.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu