IFFI 2023 సినిమా గురించి ఏం తెలియదు.. యాక్టింగ్‌కు షార్ట్ కట్స్ లేవు.. విజయ్ సేతుపతి
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 54వ వార్షిక సదస్సు గోవాలో ఘనంగా కొనసాగుతున్నది. దేశంలోని సినీ కళాకారులు, సాంకేతిక నిపుణులు భారీగా ఈ వేడుకల్లో పాలుపంచుకొంటున్నారు. పలు ప్రాంతీయ భాషలకు సంబంధించిన సినిమాలను ఇండియన్ పనోరమలో ప్రదర్శిస్తున్నారు. నవంబర్ 22వ తేదీన కళా అకాడమీలో జరిగిన సమావేశంలో తమిళ స్టార్ హీరో, హీరోయిన్ విజయ్ సేతుపతి, కుష్బూ సుందర్ పాల్గొన్నారు.
సినిమా గురించి విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. నాకు ఏమీ తెలియదు అనేదే నాకు తెలుసు. ఏదైనా సినిమా గానీ, కథతో రూపొందే సినిమాల గురించి సినీ ప్రముఖులతో లోతైన చర్చలు, అధ్యయనంతోనే నేను నా పాత్ర గురించి అవగాహన కల్పించుకొంటాను, ఆ పాత్ర కోసం ప్రిపేర్ అవుతాను అని విజయ్ సేతుపతి అన్నారు.

కథ, క్యారెక్టర్లను చూసి సాధారణ ప్రేక్షకుడు థియేటర్‌కు రాడు. కేవలం హీరోల క్రేజ్, ఆ సినిమాలో నటించే హీరో వల్లే థియేటర్‌కు వస్తాడు. దర్శకుడు చెప్పే కథ, పాత్ర తాలుకు ఔచిత్యం అర్ధం చేసుకోవడం ద్వారా, అలాగే ఆ పాత్ర పరిధి మేరకు ఫెర్ఫార్మ్ చేయడానికి ఇచ్చే స్వేచ్చ వల్లే మంచి అవుట్‌పుట్ వస్తుంది. దాంతోనే ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తాం అని విజయ్ సేతుపతి అన్నాడు.
యాక్టింగ్‌కు ఎలాంటి షార్ట్ కట్స్ లేవు. అలాగే తెరపైన రాణించడానికి ఎలాంటి ఫార్మూలాలు ఉండవు. కేవలం పాత్రను అర్ధం చేసుకొని దానిలో పరకాయ ప్రవేశం చేయడం ద్వారా మంచి నటనను ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుంది అని విజయ్ సేతుపతి చెప్పారు.

సూపర్ డీలక్స్ చిత్రంలో ట్రాన్స్‌జెండర్ పాత్ర గురించి చెబుతూ ఆ రోల్ ద్వారా నాకు జాతీయ అవార్డు రావడం గర్వంగా ఉంది. నిజ జీవితంలో ట్రాన్స్‌జెండర్లకు చోటు చేసుకొనే ఒడిదుడుకులను తెలుసుకొని.. ఆ పాత్ర ద్వారా ఫెర్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ పాత్ర గుర్తింపు లభించి అవార్డులు రావడం ఆనందం వేసింది అని విజయ్ సేతుపతి అన్నారు.


Click it and Unblock the Notifications











