Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
విజయ్ సేతుపతికి మరో చేదు అనుభవం.. కూతురికి మరీ దారుణంగా...
కోలీవుడ్‌లో విభిన్న పాత్రలతో, విలక్షణమైన నటనతో ఆకట్టుకొంటున్న ప్రతిభావంతుడైన నటుడు విజయ్ సేతుపతి గతవారం రోజులుగా మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షిస్తున్నారు. శ్రీ లంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నటించేందుకు సిద్ధం కావడంతో భారీగా బెదిరింపులు వచ్చాయి. ఆ బెదిరింపులు మితి మీరి కుటుంబానికి కూడా తాకాయి. ఈ క్రమంలో విజయ్ సేతుపతి చెన్నై పోలీసులను ఆశ్రయించారు. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..
ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ వివాదం
క్రికెట్లో అత్యధిక వికెట్లు సొంతం చేసుకొన్న క్రికెటర్, స్పిన్నర్ ముత్తయ మురళీధరన్ బయోపిక్ 800 చిత్రంలో విజయ్ సేతుపతి నటించేందుకు రెడీ అయ్యారు. ఇటీవల రిలీజైన ఫస్ట్ లుక్కు విశేష స్పందన వ్యక్తమైంది. శ్రీలంకలో తమిళుల ఊచకోత, అణిచివేత కొనసాగుతున్న నేపథ్యంలో విజయ్ సేతుపతి నటించకూడదని అభ్యంతరాలు, ఆగ్రహం వ్యక్తమయ్యాయి.
800 మూవీలో నటించవద్దని నిరసనలు
మురళీధరన్ బయోపిక్ 800 చిత్రంలో నటించే కూడదనే నిరసనలు వెల్లువెత్తడంతో, అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత పెరుగుతుండటంతో విజయ్ సేతుపతి సంచలన నిర్ణయం తీసుకొన్నారు. 800 మూవీ నుంచి తప్పుకొంటున్నట్టు సోమవారం ప్రకటన చేశారు. అయినా నెటిజన్లు వేధింపులు విజయ్ సేతుపతికి తప్పకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
తమిళ ప్రజలపట్ల వంచకుడు అంటూ...
తమిళ ప్రజలను వంచించే వ్యక్తి విజయ్ సేతుపతి. ఆయనకు తప్పక గుణపాఠం చెబుతాం. ఆయన కూతురును రేప్ చేస్తాం అంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో చెన్నైలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురును రేప్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు విజయ్ సేతుపతి ఫిర్యాదులో పేర్కొన్నారు.
విజయ్ సేతుపతి ఫిర్యాదుతో అగంతకుడు అరెస్ట్
విజయ్ సేతుపతి ఫిర్యాదును అందుకొన్న చెన్నై పోలీసులు రంగంలోకి దిగారు. అగంతకుడి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌ను ఐపీ అడ్రస్ ద్వారా గుర్తించారు. పోలీసులు అగంతకుడి గురించి ఆరా తీశారు. చివరకు రితిక్ రాజ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఘటనను తమిళ సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు.
Recommended Video
విజయ్ సేతుపతి ఫిర్యాదుపై స్పందించిన చెన్నై పోలీస్ కమిషనర్
విజయ్ సేతుపతి కుటుంబానికి ఎదురైన బెదిరింపుల ఘటనపై చెన్నై పోలీస్ కమిషనర్ మహేష్ అగర్వాల్ స్పందించారు. సెలబ్రిటీలను టార్గెట్ చేసుకొని హద్దు మీరుతున్న అగంతకులకు విషయంలో ఆందోళన వ్యక్తమవుతున్నది. విజయ్ సేతుపతి ఫిర్యాదుపై స్పందించి పోలీసు విభాగం కేసు నమోదు చేసింది అని మహేష్ అగర్వాల్ తన ట్వీట్లో పేర్కొన్నారు.