శాసిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. సైరాకు షాక్, ఆ హీరో గెటప్ ఇదే.. ఫోటోలు!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి చిత్ర షూటింగ్ ఓ కొలిక్కి వస్తోంది. వచ్చే ఏడాది సైరా విడుదల కానున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. స్వాతంత్ర సమరం నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోమారు సైరా చిత్రానికి లీకేజి బెడద తప్పలేదు. విజయ్ సేతుపతి పాత్రకు సంబందించిన ఫోటోలు లీక్ అయ్యాయి.

శాసిస్తున్న సైరా
సైరా నరసింహారెడ్డి గెటప్ లో చిరంజీవి ఉన్నా ఓ ఫోటో లీక్ అయింది. రాజసం ఉట్టిపడేలా చిరంజీవి ఓ భారీ దుంగపై కూర్చుని ఉన్నాడు. పక్కనే కత్తి కనిపిస్తోంది. సైరా నరసింహా రెడ్డిగా చిరంజీవి తన సైన్యానికి దిశా నిర్దేశం చేస్తూ శాసించే పోరాట నాయకుడిలా కనిపిస్తున్నాడు. ఈ సెటప్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకునే ఎమోషనల్ సన్నివేశంలా కనిపిస్తోంది.

విజయ్ సేతుపతి లుక్ లీక్
తమిళ హీరో విజయ్ సేతుపతి గెటప్ కూడా లీక్ అయింది. విజయ్ సేతుపతి నుదుటిపై విభూది, మెడలో హారంతో యోగిలా కనిపిస్తున్నాడు.ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సైరాకు రహస్య స్నేహితుడిగా ఉంటూ బ్రిటిష్ వారి సమాచారాన్ని చేరవేసే పాత్రలో నటిస్తునట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతి లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

విభిన్నమైన పాత్రలతో
విజయ్ సేతుపతి తమిళనాట కుడా విభిన్నమైన పాత్రలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల విడుదలైన విజయ్ సేతిపతి చిత్రం 9౬ ఘనవిజయం సాధించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ పెట్ట చిత్రంలో కుడా విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. తన విలక్షణమైన నటనతో విజయ్ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నాడు.

నయనతార
సైరా చిత్రంలో లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలని హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్స్ అద్వర్యంలో చిత్రీకరించారు. సైరా అద్భుతాలని చూసేందుకు అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











