నడి రోడ్డుపై విజయ్ సేతుపతికి చేదు అనుభవం: గొడవతో బైక్‌పై పరార్.. చివరికి ఫైన్ కట్టక తప్పలేదు
కోలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలోలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న నటులలో విజయ్ సేతుపతి ఒకరు. హీరోగానే కాకుండా సపోర్టింగ్, విలన్ రోల్స్ తో అన్ని వర్గాల అభిమానులకు దగ్గరవుతున్న ఈ నటుడు ఇటీవల ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. గొడవ కారణంగా చివరికి బైక్ పై అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. అంతే కాకుండా ప్రభుత్వ అధికారులు జరిమానా కూడా విధించారు. ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

రెమ్యునరేషన్ తగ్గించి..
కేవలం హీరోగానే కాకుండా విలన్ గా కూడా తన టాలెంట్ ను బయటపెడుతున్న సేతుపతి అవసరం అయితే చిన్న సినిమాల్లో స్పెషల్ రోల్స్ కూడా చేస్తున్నాడు. సపోర్టింగ్ రోల్ గనక నచ్చితే రెమ్యునరేషన్ విషయంలో చాలా వరకు తగ్గుతాడట. ఇక అతనికి టాలీవుడ్ నుంచి ఆఫర్స్ చాలానే వస్తున్నట్లు టాక్ వాస్తోంది.
సెక్సీ లుక్స్‌తో అదరగొడుతున్న అషికా రంగనాథ్

నడి రోడ్డుపై చేదు అనుభవం
అసలు మ్యాటట్ లోకి వెళితే ఇటీవల విజయ్ సేతుపతి నడి రోడ్డుపై చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. శనివారం తన 46వ సినిమా షూటింగ్ లో కొన్ని సీన్స్ షూట్ చేస్తుండగా అక్కడికి జనాలు ఒక్కసారిగా వచ్చేశారు. మీడియా కూడా భారీగా అక్కడికి రావడంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది.

బస్ స్టాప్ లో ఉండగా
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 46వ సినిమాను సమ్ పిక్చర్స్ ప్రొడక్షన్ లో చేస్తున్నాడు. పోన్రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా ఒక రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోందట. అయితే రియాలిటీగా ఉండాలని చిత్ర యూనిట్ విజయ్ సేతుపతితో బస్ స్టాప్ లో షూటింగ్ చేశారు. అప్పటికి సేతుపతికి సెక్యూరిటీ భారీగానే ఏర్పాటు చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు.

నచ్చజెప్పే ప్రయత్నం చేసినా..
విజయ్ ను చూసి ఒక్కసారిగా జనాలు అంత ఎగబడ్డారు. అసలే కరోనా ఎక్కువవుతున్న తరుణంలో జనాలు అంతా ఒక చోట చేరడంతో మీడియాలో కూడా న్యూస్ వైరల్ అయ్యింది. అయితే కొంత సేపటి వరకు అక్కడ జనాలకు విజయ్ సేతుపతి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంత చెప్పినా కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు.

చివరికి బైక్ పై పరార్
చివరికి విజయ్ సేతుపతి తన కారు వద్దకు వెళ్ళే పరిస్థితి కూడా కనిపించలేదు. ఫైనల్ గా షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. చిత్ర యూనిట్ సభ్యుల్లో ఒక వ్యక్తి బైక్ తీసుకు రావడంతో సేతుపతి మాస్క్ పెట్టుకొని బైక్ పై వెళ్లిపోయాడు. అందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జరిమానా విధించిన అధికారులు
ఇక చిత్ర యూనిట్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ చేయలేదని ప్రభుత్వ అధికారులు జరిమానా విధించారు. ఇక విజయ్ సేతుపతి భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల జనాలను ఎట్రాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో కూడా అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ అమితంగా పెరుగుతోంది. ఇటీవల మాస్టర్, ఉప్పెన సినిమాలు విజయ్ సేతుపతి రేంజ్ ను అమితంగా పెంచేశాయి.


Click it and Unblock the Notifications











