ఉప్పెనతో అతని కల నిజం కాబోతోంది.. సినిమా చేయడానికి కారణమిదే: విజయ్ సేతుపతి
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు అందరి చూపు ఉప్పెన సినిమాపైనే ఉంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా ద్వారా మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఇక శనివారం సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను కూడా గ్రాండ్ గా నిర్వహించగా మెగాస్టార్ ముఖ్య అతిథిగా వేడుకకు విచ్చేశారు. ఇక వేడుకలో పాల్గొన్న చిత్ర నటుడు విజయ్ సేతుపతి కూడా తన మాటలతో అందరికి ఆకట్టుకోని చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ అంధించారు.
Recommended Video

ట్రైలర్ లోనే నట విశ్వరూపం
అందరి చూపు ఎక్కువగా విజయ్ సేతుపతిపైనే ఉంది. ముఖ్యంగా విజయ్ సేతుపతి పాత్ర బాగా హైలెట్ అయినట్లు ట్రైలర్ తోనే అర్ధమయ్యింది. ట్రైలర్ లోనే నట విశ్వరూపం చూపించాడు అంటే సినిమా మొత్తంలో ఇంకా ఏ రేంజ్ లో ప్రజెంట్ చేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సేతుపతి మంచి స్పీచ్ ఇచ్చాడు.

నేను నిజంగా ఊహించలేదు
విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. తెలుగులో నాకు ఇంత ఆదరణ లవ్ దక్కుతుందని నేను నిజంగా ఊహించలేదు. ఆడియెన్స్ నాపై చాలా ప్రేమ చూపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిగారితో సైరా సినిమాలో నటించాను. అప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక ఇప్పుడు ఆయన మేనల్లుడు సినిమాలో కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది.

బుచ్చిబాబు కల నిజం కాబోతోంది.
మెగాస్టార్ చిరంజీవిగారికి నేను పెద్ద ఫ్యాన్. ఇక్కడికి వచ్చినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు కల నిజం కాబోతోంది. అతను అనుకున్నట్లు సినిమాను తెరకెక్కించాడు. ముందుగా అతను నాకు హైదరాబాద్ హయత్ లో ఉన్నప్పుడు కథ చెప్పాడు.

పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశాడు
అతనికి తమిళ్ తెలుగు రెండు తెలుసు. అయితే నేను తెలుగు ఎక్కువగా మాట్లాడకపోయినా కూడా బాగా అర్ధమవుతుంది. అందుకే తెలుగులో కథ చెప్పమని చెప్పాను. అతను ఎమోషనల్ పర్సన్. కథలో సోల్ ఉంది. అందుకే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. అయితే దాన్ని ఎలా బిగ్ స్క్రీన్ పైకి తెస్తాడు అనేది డౌట్ గా ఉండేది. కానీ అతను పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశాడు.

అతని కళ్ళు నన్ను ఆకట్టుకున్నాయి..
సుకుమార్ సార్ కు నేను కూడా పెద్ద ఫ్యాన్. ఆయన స్టూడెంట్ బుచ్చిబాబు దర్శకుడిగా మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇక సినిమాలో నటించిన వైష్ణవ్ తేజ్ కళ్ళు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. హీరో హీరోయిన్ ఇద్దరికి మంచి భవిష్యత్తు ఉంది. తప్పకుండా సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని విజయ్ సేతుపతి వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











