Just In
- 2 hrs ago
ట్రెండింగ్ :బూతులు మాట్లాడిన అనసూయ..చెక్ బౌన్స్ కేసులో హీరోయిన్..వాళ్లతో కలిసి ప్రైవేటు రిసార్ట్‌లో
- 2 hrs ago
అది చూసి చాలా బాధపడ్డా.. నిజ జీవితంలో ఏం చెయ్యగలుగుతున్నాం.. కార్తికేయ కామెంట్స్
- 3 hrs ago
కలిసిపోయిన విన్నర్, రన్నర్.. జిగేల్ రాణి స్టెప్పులేసిన శ్రీముఖి, రాహుల్
- 3 hrs ago
ట్వీట్ డిలీట్ చేసిన పూనమ్.. నేను ఆమెను లవ్ చేస్తున్నా కత్తి మహేష్ పోస్ట్ వైరల్
Don't Miss!
- News
సామాన్యుడికి అందని ద్రాక్షలా మారింది: న్యాయ ప్రక్రియపై రాష్ట్రపతి కోవింద్ ఆందోళన
- Sports
హైదరాబాద్‌లో పీవీ సింధుకి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
- Lifestyle
ప్రతి రాత్రి నిద్రించే ముందు నిమ్మ మరియు తేనె మిశ్రమ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు!
- Technology
హువాయి బ్యాండ్ 4 ప్రో రిలీజ్... దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూడండి
- Finance
జీఎస్టీ స్లాబ్ 5 నుంచి 6 శాతానికి పెంచే ఛాన్స్, స్వల్పంగా పెరగనున్న ధరలు
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
పవన్ కళ్యాణ్ అనుకున్నాం కానీ! ఎన్టీఆర్ కోసం చేస్తా.. సీక్రెట్స్ బయటపెట్టిన విజయ్ సేతుపతి డైరెక్టర్
ఓ హీరోతో సినిమా చేయాలనుకొని కథ రాసుకుంటే.. అనుకోకుండా ఆ ప్లేస్‌లో మరో హీరో వచ్చి చేరడం దర్శకులకు సాధారణంగా జరిగే సంఘటనలే. అయితే ఈ విషయం సినిమా విడుదలయ్యాక కొద్దిరోజులకు తెలుస్తుంది. కానీ తాజా సినిమా విజయ్ సేతుపతి విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. ఏకంగా సినిమా విడుదలకు ముందే ఈ సినిమా సీక్రెట్స్ అన్నీ మీడియా ముఖంగా చెప్పి ఆశ్చర్యపరిచారు విజయ్ సేతుపతి సినిమా డైరెక్టర్. వివరాల్లోకి పోతే..

విజయ్ సేతుపతితో విజయ్ చందర్
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘సంగతమిళన్'. ఈ సినిమాను తెలుగులో ‘విజయ్ సేతుపతి' అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. చిత్రంలో విజయ్ సేతుపతి సరసన రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, నివేద పేతురాజ్ కీలక పాత్ర పోషిస్తోంది. విజయ్ చందర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 15వ తేదీన రెండు భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదలవుతోంది.

ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్
విజయ్ సేతుపతి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ విజయ్ చందర్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీక్రెట్స్ బయటపెట్టేశాడు. ముందుగా పవన్ కళ్యాణ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా కథను రాసుకున్నానని, అయితే ఆయన రాజకీయాలతో బిజీ కావడం కారణంగా విజయ్ సేతుపతిని తీసుకున్నామని చెప్పారు.

ఇక్కడ పవన్.. అక్కడ విజయ్ సేతుపతి అందుకే..
తెలుగులో పవన్ కళ్యాణ్‌కి ఎంత పాపులారిటీ, ఇమేజ్ ఉందో.. తమిళంలో విజయ్ సేతుపతికి కూడా అంతే ఫాలోయింగ్ ఉందని, అందుకే ఈ కథను ఆయనతో చేశామని చెప్పారు డైరెక్టర్ విజయ్ చందర్. ఈ కథ విన్న విజయ్ సేతుపతి వెంటనే ఓకే చెప్పారని ఆయన తెలిపారు.

ప్రజా సమస్య గురించి పోరాడే వ్యక్తి
ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక ప్రజా సమస్య గురించి పోరాడే వ్యక్తిగా నటిస్తారని డైరెక్టర్ విజయ్ చందర్ అన్నారు. విజయ్ సేతుపతి ద్విపాత్రాభినయం చేశారని ఈ సందర్బంగా ఆయన వెల్లడించారు. తెలుగు, తమిళ భాషల్లో పక్కాగా ఈ సినిమా సూపర్ హిట్ సాధిస్తుందని నమ్మకంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలతో..
తమిళంలో కంటే తెలుగులోనే కమర్షియల్ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని, అందుకే ఇక్కడ సినిమాలు చేయాలనుకుంటున్నానని తన మనసులో మాటను బయటపెట్టారు డైరెక్టర్ విజయ్ చందర్. జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలతో సినిమాలు చేయడమంటే తనకు చాలా ఇష్టమని, ఆయన కోసం కథ సిద్ధం చేస్తానని ఈ సందర్బంగా ఆయన చెప్పారు.