ఉప్పెనలా రాబోతున్న విజయ్ సేతుపతి.. సమ్మర్ లోనే 4 సినిమాలు!
సౌత్ ఇండియాలోనే కాకుండా నేషనల్ వైడ్ గా కూడా ఎక్కువగా బిజీగా ఉండే అతికొద్ది మంది నటీనటులలో విజయ్ సేతుపతి ఒకరు. ఆయన ఎలాంటి సినిమా చేసినా కూడా ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీ స్థాయిలో క్రియేట్ అవ్వడం కామన్. సేతుపతి ఒక సినిమాలో ఉన్నాడు అంటే అందులో ఎదో ఒక కొత్త పాయింట్ ఉంటుందని చెప్పవచ్చు. ఆ విధంగా జనాల్లో ఒక నమ్మకాన్ని పెంచుకున్నాడు.
ఇక సినిమాలో ఎన్ని మైనెస్ లు ఉన్నా కూడా విజయ్ సేతుపతి తన నటనతోనే బజ్ క్రియేట్ చేయడం పక్కా. ఇప్పటికే 2021లో మాస్టర్, ఉప్పెన సినిమాలతో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న ఈ యాక్టర్ మరిన్ని డిఫరెంట్ సినిమాలను వదలబోతున్నాడు.
సమ్మర్ లోనే 4 సినిమాలు విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. తుగ్లక్ దర్బార్, లాభమ్, యాధుమ్ ఒరే యావరుం కేలిర్, మామనితాన్ వంటి తమిళ్ సినిమాల్లో పవర్ఫుల్ పాత్రల్లో నటించాడు. త్వరలోనే ఆ సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ కాబోతున్నాయి.

ఆ సినిమాలతో పాటు 2021లో విజయ్ సేతుపతి ఒక డార్క్ కామెడీ సినిమాతో కూడా రాబోతున్నాడు. ఉప్పెన హిట్టు కావడం వలన విజయ్ సేతుపతి నటించిన కొన్ని పాత తమిళ్ సినిమాలను కూడా తెలుగులో డబ్ చేసి విడుదల చేయాలని చూస్తున్నారు. ఆ సినిమాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో గాని సేతుపతి డేట్స్ ఇవ్వగలిగితే అతనితో తెలుగులో డైరెక్ట్ సినిమా చేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారు. మరి సేతుపతి రానున్న రోజుల్లో ఏలాంటి హిట్స్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











