మెర్సల్ గొంతు నొక్కకండి.. విజయ్‌కు మద్దతుగా కమల్, రాహుల్, పా రంజిత్ ట్వీట్స్
జీఎస్టీ, డిజిటల్ ఇండియా కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఉన్న ఈ చిత్రంలో డైలాగ్స్‌ను తొలగించాలని ఓ పక్క బీజేపీ నేతలు డిమాండ్ చేస్తుంటే.. మరో పక్క కాంగ్రెస్ నేతలు హీరో విజయ్‌కు మద్దతుగా నిలిచారు. మెర్సల్ చిత్
Recommended Video

తమిళ ఇలయపతి విజయ్ నటించిన మెర్సల్ చిత్రం తమిళనాడులో బీజేపీకి ఇబ్బందిగా మారింది. మెడికల్ మాఫియా, అక్రమ దందాలపై ధ్వజమెత్తిన మెర్సల్ చిత్రానికి ప్రముఖుల మద్దతు పెరుగుతున్నది.
జీఎస్టీ, డిజిటల్ ఇండియా కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఉన్న ఈ చిత్రంలో డైలాగ్స్‌ను తొలగించాలని ఓ పక్క బీజేపీ నేతలు డిమాండ్ చేస్తుంటే.. మరో పక్క కాంగ్రెస్ నేతలు హీరో విజయ్‌కు మద్దతుగా నిలిచారు. మెర్సల్ చిత్రానికి మద్దతు తెలిపిన వారిలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కమల్ హాసన్, కబాలీ దర్శకుడు పా రంజిత్, పీసీ శ్రీరాం, శ్రీ విద్య, శరత్ కుమార్ తదితరులు ఉన్నారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ట్వీట్లతో అండగా నిలిచారు.
రీ సెన్సార్ తప్పు
మెర్సల్ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది. మళ్లీ రీ సెన్సార్ చేయాలని డిమాండ్ చేయడం తప్పు. బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు జవాబు ఇవ్వాలి. విమర్శకులు మౌనంగా ఉండకూడదు. విమర్శకులు మాట్లాడినప్పుడే భారత్ పురోగతి చెందుతుంది అని కమల్ ట్వీట్ చేశారు.
సినిమా అనేది తమిళులకు ప్రతీక
మిస్టర్ మోదీ. సినిమా అనేది తమిళ సంస్కృతి, భాషకు ప్రతీక. మెర్సల్ చిత్రాన్ని వివాదంగా మలిచి తమిళుల మనోభావాలను దెబ్బతీయకు అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

సీన్స్ తొలగించే అవసరం లేదు
మెర్సల్ చిత్రంలో జీఎస్టీ, ఇతర సమస్యల గురించి చెప్పిన కొన్ని సన్నివేశాలను తీయాల్సిన అవసరమే లేదు. ఆ సన్నివేశాలకు థియేటర్లలో చప్పట్లు మోగుతున్నాయి. ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. ప్రజల ఆకాంక్షలను రాజకీయ నేతలు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి అని కబాలి దర్శకుడు పా రంజిత్ ట్వీట్ చేశారు.
గొంతు నొక్కకండి
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరాం తీవ్రంగా స్పందించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ గొంతు నొక్కుతున్నారు అని ఆయన ట్వీట్ చేశారు.

ప్రశ్నిస్తే సెన్సార్ ఎందుకు
మెర్సల్ చిత్రానికి ప్రముఖ నటుడు శరత్ కుమార్ మద్దతుగా నిలబడ్డారు. సినిమాకు ఒకసారి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మళ్లీ ప్రశ్నించకూడదు. ఒకవేళ ప్రశ్నిస్తే.. సెన్సార్ బోర్డు ఉన్నది ఎందుకు అని శరత్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు.
చిదంబరం ఫైర్
మెర్సల్‌పై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం స్వరం పెంచారు. మెర్సల్ చిత్రంలోని సన్నివేశాలను తొలగించాలి అని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. ఒకవేళ పరాశక్తి విడుదలైతే వారి పరిస్థితి ఏమిటో అని ఆయన ట్వీట్ చేశారు.
తమిళ బీజేపీ దిగజారింది..
మెర్సల్ చిత్రాన్ని వివాదాన్ని చేయడాన్ని బట్టి చూస్తే తమిళనాడు బీజేపీ ఏస్థాయికి దిగజారిందో అర్థమవుతున్నది. క్రిస్టియన్ అనే పేరుతో బీజేపీ ఎటాక్ చేయడం చాలా దారుణం అని సినీ నటి, కాంగ్రెస్ నేత నగ్మా ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











