దుమ్ము రేపుతున్న మెర్సల్.. 200 కోట్ల క్లబ్ వైపు పరుగులు

తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన మెర్సల్ చిత్రం అనేక వివాదాల నడుమ దూసుకుపోతున్నది. స్వదేశంలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో దుమ్ము రేపుతున్నది.

By Rajababu

తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన మెర్సల్ చిత్రం అనేక వివాదాల నడుమ దూసుకుపోతున్నది. స్వదేశంలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో దుమ్ము రేపుతున్నది. తొలివారాంతంలో వంద కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. వారాంతం తర్వాత కూడా అదే ఊపును కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తున్నది. ట్రేడ్ అనలిస్టుల వెల్లడించిన వివరాల ప్రకారం కలెక్షన్లు ఇలా ఉన్నాయి..

 150 కోట్ల క్లబ్‌లో మెర్సల్

150 కోట్ల క్లబ్‌లో మెర్సల్

దీపావళి పండుగ నేపథ్యంలో అక్టోబర్ 19న రిలీజ్ అయిన మెర్సల్ చిత్రం ఐదురోజుల్లోనే 150 కోట్ల క్లబ్‌లో చేరింది. విజయ్ కెరీర్‌లో 150 కోట్ల క్లబ్‌లో చేరిన రెండో చిత్రం. గతంలో అట్లీ, విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన తెరీ చిత్రం కూడా 150 కోట్ల క్లబ్‌‌లో చేరిన సంగతి తెలిసిందే.

Recommended Video

Mersal / Adirindi Movie facing Problem : మూతపడిన మెర్సల్ సినిమా థియేటర్లు
 200 కోట్ల క్లబ్ వైపు పరుగులు

200 కోట్ల క్లబ్ వైపు పరుగులు

వారాంతం తర్వాత సోమవారం కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు భారీగానే ఉన్నాయి. ఇదే ఊపు కొనసాగిస్తే తొలివారం ముగిసే వరకు మెర్సల్ చిత్రం 200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు.

కేరళ, కర్ణాటకలో భారీగా

కేరళ, కర్ణాటకలో భారీగా

మెర్సల్ కలెక్షన్లు రాష్ట్రాలు, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం గత ఐదు రోజుల్లో కేరళలో 10 కోట్లు, కర్ణాటకలో 10 కోట్లు, మలేషియాలో 11.1 కోట్లు వసూళు చేసింది. దాంతో పంపిణీదారులు సేఫ్ జోన్‌లోకి వెళ్లినట్టు సమాచారం.

యూఎస్‌లో 6.5 కోట్లు

యూఎస్‌లో 6.5 కోట్లు

ఇక అమెరికాలో కూడా మెర్సల్ కలెక్షన్ల మోత మోగిస్తున్నది. ఈ చిత్రం 1 మిలియన్ క్లబ్‌లో చేరింది. ఇప్పటివరకు యూఎస్‌లో రూ.6.5 కోట్లు వసూలు చేసింది. తొలివారం ముగిసే సమయానికి పంపిణీదారులు లాభాల్లోకి చేరుకొనే అవకాశం ఉంది.

 ఈ నెల 27న తెలుగులో

ఈ నెల 27న తెలుగులో

సుమారు 130 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన మెర్సల్ చిత్రంలో విజయ్‌తోపాటు కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, సమంతా అక్కినేని, ఎస్‌జే సూర్య తదితరులు నటించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగులో ఈనెల 27న రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X