»   » దుమ్మురేపిన ఫస్ట్ లుక్: ఆ సినిమా హక్కులు దక్కించుకొన్న టీవీ ఛానల్

దుమ్మురేపిన ఫస్ట్ లుక్: ఆ సినిమా హక్కులు దక్కించుకొన్న టీవీ ఛానల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై: 24 ఫ్రేమ్స్ స్టూడియో దక్షిణాది సినిమా పరిశ్రమలో పేరుపొందిన ప్రొడక్షన్ హౌస్. సినిమా పరిశ్రమలోని ప్రతి విభాగంలో వృత్తిపర ప్రొఫెషనలిజం, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు పెట్టింది పేరు.

  24ఏఎం స్టూడియోస్ తాజా మూవీ వెలైక్కరణ్ హక్కులను విజయ్ టీవీ దక్కించుకుంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి ఆదరణ లభించింది.

  ఈ సినిమాలో శివకార్తికేయన్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార మొదటిసారి కార్తికేయన్ పక్కన నటిస్తోంది. మలయాళ నటి ఫహద్ కీలకపాత్రలో నటిస్తోంది.

  Vijay TV has bagged the satellite rights of Sivakarthikeyan starrer VELAIKKARAN

  మంచి కథ, కథనం కలిగిన సినిమాలను ఎంచుకోవడంలో విజయ్ టీవీకి పేరు ఉంది. ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన ఆదరణ వచ్చిన తర్వాత.. ఇప్పుడు ఈ సినిమా హక్కులు కూడా దక్కించుకుంది.

  శివకార్తికేయన్ మెగాస్టార్‌గా ఎదుగుతున్నారని, అందుకు ఆనందిస్తున్నామని విజయ్ టవీ చానల్ హెడ్ కృష్ణన్ కుట్టీ తెలిపారు. అతని ప్రతిభ అద్భుతం అన్నారు. అతను అన్ని వయస్సుల వారిని, అలాగే అన్ని వర్గాల వారిని అలరిస్తాడని చెప్పారు.

  వెలైక్కరన్ హక్కులు దక్కించుకున్నందుకు తమకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ ఏడాది టాప్ మూవీస్‌లలో ఇది ఒకటి అవుతుందని తాము భావిస్తున్నామని చెప్పారు. ఫస్ట్ లుక్‌కు అద్భుత ఆదరణ రావడంతో పాటు, అందరిలోను ఉత్కంఠను పెంచిందని చెప్పారు.

  24ఏఎం స్డూడియోస్ ప్రొడ్యూసర్ ఆర్డీ రాజా మాట్లాడుతూ.. థాని ఓరువన్‌తో మోహన్ రాజా మమ్మల్ని ఆకట్టుకున్నాడని, ఇప్పుడు మరోసారి రిపీట్ అవనుందని చెప్పారు. శివకార్తీకేయన్, విజయా టీవీ, 24ఏఎం స్టూడియోస్‌లు ఓ కుటుంబం వంటివి అని చెప్పారు.

  సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు మంచి సంగీతం ఇచ్చారని చెప్పారు. కాగా, వెలైక్కరన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 29వ తేదీన విడుదల కానుంది.

  English summary
  24AM STUDIOS has earned the name and fame of being one of the most established and distinguished production house in South Indian fil industry with their professional approach in every department of film making and their prestigious line up of projects.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more