Varasudu Twitter Review: వారసుడికి ఊహించని టాక్.. తమిళంలో అలా.. తెలుగులో ఇలా.. విజయ్ మూవీ హిట్టేనా!
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా సౌతిండియా మొత్తంలో ప్రభావాన్ని చూపిస్తూ తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటూ ముందుకు సాగుతోన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్. ఈ మధ్య కాలంలో భారీ విజయం కోసం వేచి చూస్తోన్న అతడు.. తాజాగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో 'వారసుడు' అనే సినిమాను చేశాడు. ఈ తమిళ వెర్షన్ 11వ తేదీనే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈరోజు ఈ మూవీ తెలుగులో విడుదల అయింది. ఈ నేపథ్యంలో 'వారసుడు'కు ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వస్తుందో ఓ లుక్కేద్దాం పదండి మరి!

వారసుడుగా వచ్చేసిన విజయ్
ఇళయదళపతి విజయ్ నటించిన తాజా చిత్రమే 'వారసుడు'. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇందులో శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కుస్భూ, జయసుధ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు.

తమిళంలో రిలీజ్.. తెలుగులో
ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ జోనర్‌లో మాస్ ఎలిమింట్స్ జోడించి తెరకెక్కించిన చిత్రమే 'వారసుడు'. ఈ మూవీ నుంచి వచ్చిన అన్ని రకాల అప్‌డేట్లకు భారీ రెస్పాన్స్ దక్కడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తమిళంలో ఈ చిత్రాన్ని జనవరి 11నే విడుదల చేశారు. అయితే, 'వారసుడు'ను మాత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

తమిళంలో అలాంటి ఫలితం
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన 'వారిసు' మూవీ ఎన్నో అంచనాల నడుమ తమిళంలో జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కడ ఈ సినిమాకు ఏవరేజ్ టాకే వచ్చింది. అంతేకాదు, ఓపెనింగ్ కలెక్షన్లు కూడా అనుకున్న రేంజ్‌లో మాత్రం దక్కలేదు. కానీ, సంక్రాంతి హాలీడేస్‌ను ఉపయోగించుకుని తమిళంలో బాగానే ఆడుతోంది.
ట్విట్టర్‌లో సినిమా టాక్ ఇలా
విజయ్ నటించిన 'వారసుడు' మూవీ తెలుగులో మూడు రోజులు ఆలస్యంగా విడుదల అయింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో కొన్ని షోలు ప్రదర్శితం అయ్యాయి. తమిళంలో మాదిరిగానే తెలుగులో కూడా ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకూ కనిపించిన ట్వీట్ల ప్రకారం.. ఇది బాగుందని కొందరు, ఏవరేజ్ అని మరికొందరు చెప్తున్నారు.
రెండు సినిమాలతో పోలుస్తూ
తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన 'వారసుడు' మూవీని వీక్షించిన ఓ తెలుగు ప్రేక్షకుడు ట్విట్టర్‌లో 'బ్రహ్మోత్సవం, అజ్ఞాతవాసి మూవీలను మించిన ల్యాగ్‌ను కొట్టేశాం అన్నయ్యా. ఎంత బాగా చేశారు అన్నయ్యా.. చెప్పినందుకు బాధగా ఉన్నా మన వాళ్లు ఫస్ట్ అరగంటకే లేచి వెళ్లిపోతోన్నారు. ఇక, ఈ మూవీ ట్రిమ్ చేయకపోతే' అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశాడు.

చూస్తే అక్కడే చూడండంటూ
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ నటించిన 'వారసుడు' మూవీని చూసిన మరొకరు ట్విట్టర్‌లో షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో 'వారసుడు డబ్బింగ్, సాంగ్స్, ఎడిటింగ్ షాకింగ్‌గా ఉన్నాయి. అస్సలు బాలేదు. మీరు కచ్చితంగా చూడాలి అనుకుంటే ఈ చిత్రాన్ని తమిళంలోనే చూడండి' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

తమిళంలో అలా.. తెలుగులో
విజయ్ నటించిన వారిసు మూవీ సంతృప్తిని మిగిల్చే ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని.. ఫస్టాఫ్ సోసోగానే ఉన్నా.. సెకెండాఫ్ మాత్రం మంచి కమర్షియల్ హంగులతో బాగుందని తమిళంలో టాక్ వచ్చింది. కానీ, తెలుగులో మాత్రం ఇది ఆశించిన రీతిలో లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ట్విట్టర్‌లో చాలా మంది విజయ్ చిత్రానికి నెగెటివ్‌గానే పోస్టులు చేస్తుండడం గమనార్హం


Click it and Unblock the Notifications











