వైఎస్ రాజశేఖరరెడ్డి వెనకుండి నాతో... : విజయచందర్

విజయచందర్ మాట్లాడుతూ -''తెలుగుజాతికి వన్నె తెచ్చిన మహనీయులు టంగుటూరి ప్రకాశం, ఎన్టీఆర్, వైఎస్ఆర్. ఈ ముగ్గురిలో టంగుటూరి, ఎన్టీఆర్ పాత్రలు చేసేశాను. ఇప్పుడు వైఎస్సార్ పాత్ర చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను నటించడం యాదృచ్ఛికం. ఆ మహానేతే నా వెనకుండి నాతో ఈ పాత్ర చేయించుకుంటారనుకుంటున్నాను'' అన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితాన్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నామన్నారు. డిసెంబరులో సినిమాని విడుదల చేస్తామన్నారు నిర్మాత.
రాజశేఖర్‌రెడ్డి జీవితాన్ని సినిమాగా తీయాలంటే సరైన పాత్రధారులకోసం చాలారోజులు ప్రయత్నించామని, ఎందరికో ఆదర్శనీయమైన ఆయన జీవితం ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరిస్తున్నామని, మంచి నటులు దొరికారని, విజయ్‌చందర్ ఆ పాత్రని చేస్తాననగానే కొండంత బలంతో ఈ చిత్రాన్ని ప్రారంభించామని, ఓ మంచి చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం తమ అదృష్టంగా నిర్మాత షేక్ సైదా సూరజ్ తెలిపారు.
డిసెంబర్లో సినిమా విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. ముహూర్తపు సన్నివేశానికి రెహమాన్ క్లాప్‌నిచ్చారు. మోహన్.వి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. హేమసుందర్, వల్లభనేని జనార్ధన్, శ్రీనాధ, చిట్టిబాబు, సురేష్, శశిధర్, చాంద్‌బాషా, గౌతంరాజు, దాసన్న, అశోక్‌కుమార్, సత్యప్రకాష్, వినోద్, వైభవ్, అభి, కోట శంకరరావు, అల్లరి సుభాషిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: పి.శ్రీను, సంగీతం: లక్ష్మణసాయి, రవి ములకలపల్లి, మాటలు: తులసీ శ్రీనివాసరావు, నిర్మాత: షేక్‌సైదా సూరజ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కంకణాల శ్రీనివాస్‌రెడ్డి.


Click it and Unblock the Notifications











