twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెనకుండి నాతో... : విజయచందర్

    By Srikanya
    |

    Vijaya Chandar
    హైదరాబాద్ :కరుణామయుడు చిత్రంలో ఏసుప్రభువుగా, శ్రీ షిర్డీసాయిబాబా మహత్మ్యంలో సాయిబాబాగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న విజయ్‌చందర్ ఈసారి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి పాత్రలో ఒదిగిపోనున్నారు. 'మా నేత రాజన్న' పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రానికి కంకణాల శ్రీనివాసరెడ్డి దర్శకుడు. షేక్‌సైదా సూరజ్‌ నిర్మాత. ఈ సినిమా ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది.

    విజయచందర్ మాట్లాడుతూ -''తెలుగుజాతికి వన్నె తెచ్చిన మహనీయులు టంగుటూరి ప్రకాశం, ఎన్టీఆర్, వైఎస్ఆర్. ఈ ముగ్గురిలో టంగుటూరి, ఎన్టీఆర్ పాత్రలు చేసేశాను. ఇప్పుడు వైఎస్సార్ పాత్ర చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను నటించడం యాదృచ్ఛికం. ఆ మహానేతే నా వెనకుండి నాతో ఈ పాత్ర చేయించుకుంటారనుకుంటున్నాను'' అన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితాన్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నామన్నారు. డిసెంబరులో సినిమాని విడుదల చేస్తామన్నారు నిర్మాత.

    రాజశేఖర్‌రెడ్డి జీవితాన్ని సినిమాగా తీయాలంటే సరైన పాత్రధారులకోసం చాలారోజులు ప్రయత్నించామని, ఎందరికో ఆదర్శనీయమైన ఆయన జీవితం ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరిస్తున్నామని, మంచి నటులు దొరికారని, విజయ్‌చందర్ ఆ పాత్రని చేస్తాననగానే కొండంత బలంతో ఈ చిత్రాన్ని ప్రారంభించామని, ఓ మంచి చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం తమ అదృష్టంగా నిర్మాత షేక్ సైదా సూరజ్ తెలిపారు.

    డిసెంబర్లో సినిమా విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. ముహూర్తపు సన్నివేశానికి రెహమాన్‌ క్లాప్‌నిచ్చారు. మోహన్‌.వి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. వి.సాగర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. హేమసుందర్, వల్లభనేని జనార్ధన్, శ్రీనాధ, చిట్టిబాబు, సురేష్, శశిధర్, చాంద్‌బాషా, గౌతంరాజు, దాసన్న, అశోక్‌కుమార్, సత్యప్రకాష్, వినోద్, వైభవ్, అభి, కోట శంకరరావు, అల్లరి సుభాషిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: పి.శ్రీను, సంగీతం: లక్ష్మణసాయి, రవి ములకలపల్లి, మాటలు: తులసీ శ్రీనివాసరావు, నిర్మాత: షేక్‌సైదా సూరజ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కంకణాల శ్రీనివాస్‌రెడ్డి.

    English summary
    Vijay Chandar will be shown as YSR in a new film. Maa Netha Rajanna...a new film on YSR directed by k.Srinivasa Reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X