అల్లు అరవింద్ మాట్లాడితే సామాజిక న్యాయమంటున్నారు..మరో ప్రక్క తామను ఇంత స్ధాయికి తీసుకువచ్చిన సినీ పరిశ్రమలోని చిన్న నిర్మాతలను అణగతొక్కేస్తున్నారు..ఇదెక్కడి అన్యాయం అంటున్నారు నటుడు,నిర్మాత విజయ్ చందర్. డిస్ట్రిబ్యూటర్స్ గా,ఎగ్జిబిటర్స్ గా మారి అందరినీ ఇబ్బంది పెడుతున్న నలుగురు నిర్మాతలో రెండవవాడు అరవిందే నని ఆయన విమర్శించారు.అంతేగాక సామాజిక న్యాయం నినాదంతో ముందుకెళ్తున్న చిరంజీవి సైతం తన బావ మరిది అరవింద్ చేస్తున్న ఈ పనులును అడ్డుకోకపోవటం విచారకరం అని ఆయన తీవ్రంగా స్పందిచారు.అలాగే రాష్ట్రంలోని డిస్ట్రిబ్యూటర్స్,ఎగ్జిబీటర్స్ అంతా వీళ్ళ నలుగురి వల్లే నానాయాతన పడుతున్నారని,వారు శాసించే స్ధితిలో ఉండటం వల్లే ఈ విపత్కర పరిస్థితి వచ్చిందని అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు.
Story first published: Monday, December 15, 2008, 14:17 [IST]