నోటా మూవీ ప్రీ రిలీజ్ రివ్యూ: విజయ్ దేవరకొండ నటన అదుర్స్!
అర్జున్ రెడ్డి, మహానటి, గీత గోవిందం చిత్రాల ఘనవిజయం తర్వాత విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారిపోయాడు. కేవలం నాలుగు చిత్రాల తర్వాత బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లకు కింగ్‌గా మారిపోయాడు. ఆయన నటించిన గీతా గోవిందం 100 కోట్లకుపైగా సాధించింది. ఇలా తక్కువ కాలంలోనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించుకొన్న విజయ్ దేవరకొండ తాజా చిత్రం నోటా. ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో సినిమా కథ ఏంటి? విజయ్ దేవరకొండ పాత్ర ఏంటి? ఇతర సాంకేతిక అంశాల గురించి క్లుప్లంగా..

నోటా మూవీ స్టోరి
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన వరుణ్ (విజయ్ దేవరకొండ) అనుకోకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. జీవితాన్ని విలాసాలతో ఎంజాయ్ చేసే వరుణ్ సీఎం పదవిని తేలికగా తీసుకొంటాడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ముఖ్యమంత్రి పదవిని సీరియస్‌గా తీసుకోవాల్సి వస్తుంది. తన ఎదుట నిలిచిన ప్రతికూల పరిస్థితులను ఏ విధంగా అధిగమించాడు అనే ప్రశ్నలకు సమాధానమే నోటా సినిమా కథ
Recommended Video


విజయ్, ఇతర నటీనటుల ప్రతిభ
ప్రాథమిక అంతర్గత సమాచారం ప్రకారం.. విజయ్ దేవరకొండ అద్భుతమైన పాత్రకు జీవం పోశారనే మాట వినిపిస్తున్నది. విజయ్ నటన నోటాకు ప్రత్యేక ఆకర్షణగా మారిందని చెప్పుకొంటున్నారు. నాజర్, సత్యరాజ్ కీలకమైన పాత్రలో కనిపించారు. మెహ్రీన్ పిర్జాదా గ్లామర్ అదనపు ఆకర్షణ. పులికొండ ప్రియదర్శి, యషికా ఆనంద్, అనస్తాసియా మాస్లోవా, సంచాన నటరాజన్ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారని చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి.

గత చిత్రాల కంటే భిన్నంగా
గత చిత్రాల కంటే భిన్నంగా విజయ్ దేవరకొండ యువ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించారు. సినీ తెరపై ఇంత తక్కువ వయసులో ఓ హీరో సీఎంగా కనిపించిన దాఖలాలు లేవు. ఈ చిత్రం కోసం మంత్రి కేటీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని తన పాత్రను రూపొందించారని విజయ్ దేవరకొండ వెల్లడించారు.

విజయ్ దేవరకొండ, మెహ్రీన్ ఫిర్జాదా
విజయ్ దేవరకొండ, మెహ్రీన్ ఫిర్జాదా మధ్య కెమిస్ట్రీ కొత్తగా ఉంటుందని చెప్పుకొంటున్నారు. ఈ జంట తెరపైన చాలా ఫ్రెష్‌గా ఉన్నట్టు తెలిసింది. వీరిద్దరి మధ్య రొమాన్స్ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం ఖాయమంటున్నారు.

ఆనంద్ శంకర్ దర్శకత్వం
తమిళంలో ఇరుమురగన్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. షాన్ కురుప్పుస్వామి అందించిన కథను అద్భుతంగా తెరకెక్కించడమే కాకుండా భావోద్వేగాలను పండించినట్టు సమాచారం.

కేజీ జ్ఞానవేల్ రాజా నిర్మాణం
స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేజీ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని రూపొందించారు. తమిళంలో ఈ చిత్రానికి యూ, తెలుగులో యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ లభించింది.

తెర వెనుక, తెర ముందు
నటీనటులు: విజయ్ దేవరకొండ, మెహ్రీన్ ఫిర్జాదా, నాజర్, సత్యరాజ్, ప్రియదర్శి
దర్శకత్వం: ఆనంద్ శంకర్
నిర్మాత: కేజీ జ్ఞానవేల్ రాజా
సంగీతం: శ్యామ్ సీఎస్
సినిమాటోగ్రఫి: శంతన కృష్ణన్, రవిచంద్రన్
ఎడిటింగ్: రేమండ్ డెర్రిక్ క్రస్టా
బ్యానర్: స్టూడియో గ్రీన్
నిడివి: 153 నిమిషాలు
రిలీజ్: 2018-10-05


Click it and Unblock the Notifications











