కన్నీటిపర్యంతమైన కృష్ణకు బాలయ్య పరామర్శ... విజయ నిర్మల దశదిన కర్మలో!

ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల మృతితో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆమె మరణం సూపర్ స్టార్ కుటుంబాన్ని దు:ఖ సాగరంలో ముంచింది. విజయ నిర్మల మరణం నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆమె దశదిన ఖర్మను నిర్వహించారు. గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమంలోని వేదిక వద్ద విషాద ఛాయలు కనిపించాయి. ఈ సందర్బంగా ఆమెకు బాధాతప్త హృదయంతో శ్రద్దాంజలి ఘటించారు. వివరాల్లోకి వెళితే..

భారీగా ప్రముఖులు, అభిమానులు

జూలై 6వ తేదీ శనివారం ఉదయం గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన దశ దిన ఖర్మకు భారీగా సినీ ప్రముఖులు హాజరయ్యారు. హీరో నందమూరి బాలకృష్ణ, నిర్మాత, పారిశ్రామిక వేత్త టి సుబ్బిరామిరెడ్డి, జయసుధ, మహేష్ బాబు, ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి, నిర్మాత ఆదిశేషగిరిరావు తదితరులు హాజరయ్యారు. కృష్ణ, నరేష్‌ను ప్రముఖులు, అభిమానులు పరామర్శించారు.

హీరో బాలకృష్ణ పరామర్శ

హీరో బాలకృష్ణ పరామర్శ

భార్య మరణంతో విషాదంలో మునిగిపోయిన సూపర్ స్టార్ కృష్ణను హీరో బాలకృష్ణ ప్రత్యేకంగా పరామర్శించారు. విజయ నిర్మల మృతితో బాధపడుతున్న నరేష్, ఇతర కుటుంబం సభ్యులను బాలయ్య ఓదార్చారు. ఆమె ఆత్మకు శాంతి కలుగాలని భగవంతుడికి ప్రార్థించారు. విజయ నిర్మల చిత్ర పటానికి పూలు సమర్పించి శ్రద్దాంజలి ఘటించారు. సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకొన్నారు.

నమ్రత, జయసుధ పర్యవేక్షణతో

నమ్రత, జయసుధ పర్యవేక్షణతో

సంధ్య కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమాన్ని విజయ నిర్మలకు అత్యంత సన్నిహితురాలు, ప్రముఖ గాయని రావు బాలసరస్వతి జ్యోతి ప్రజ్వలన చేశారు. జయసుధ, నమత్రా శిరోద్కర్ కార్యక్రమాలను ముందుండి నడిపించారు. అభిమానులకు, ప్రముఖులకు ఎలాంటి లోటు రాకుండా అన్నీ ఏర్పాట్లను నమ్రత పర్యవేక్షించారు.

చిన్న అపశృతితో

చిన్న అపశృతితో

విజయ నిర్మల దశదిన ఖర్మకు భారీగా అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు తరలివచ్చారు. అభిమానులతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సందర్బంగా చిన్న అపశృతి చోటుచేసుకొన్నది. అక్కడ వేసిన టెంట్ కూలడంతో ఆందోళనకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరిపోల్చుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X