For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విజయ నిర్మల మృతితో శోక సంద్రంలో టాలీవుడ్.. చిరంజీవి, బాలకృష్ణ, వైఎస్ జగన్ ఎమోషనల్

|

నటి, దర్శకురాలు, గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీత విజయ నిర్మల ఆకస్మిక మృతితో సినీ లోకం మూగపోయింది. జూన్ 26 తేదీ అర్ధరాత్రి గచ్చిబౌలిలోని ప్రముఖ హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచిరానే వార్త స్నేహితులను, సన్నిహితులను, సినీ ప్రముఖులను శోక సంద్రంలో ముంచింది. ఆమె లేని లోటు గురించి తలచుకొంటూ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, ఏపీ సీఎం వైఎస్ జగన్, మంత్రి తలసాని, దర్శకుడు మారుతి తదితరులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సంతాప ప్రకటనలు వారి మాటల్లోనే..

గొప్ప ప్రతిభావంతురాలు: చిరంజీవి

గొప్ప ప్రతిభావంతురాలు: చిరంజీవి

అరుదైన ద‌ర్శ‌క న‌టీమ‌ణి శ్రీమ‌తి విజ‌య నిర్మ‌ల గారి హ‌ఠాన్మ‌ర‌ణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "మ‌న తెలుగు ప‌రిశ్ర‌మ‌లో భానుమ‌తి గారి త‌ర్వాత గ‌ర్వించ‌ద‌గిన బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి శ్రీమ‌తి విజ‌య‌నిర్మ‌ల గారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు అని చిరంజీవి అన్నారు.

కృష్ణగారికి చేదోడు వాదోడుగా: చిరంజీవి

కృష్ణగారికి చేదోడు వాదోడుగా: చిరంజీవి

బాలనటిగా, కథానాయికగా.. దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటారు విజయనిర్మల.

అంత‌టి ప్రతిభావంతురాలిని మ‌నం ఇప్ప‌ట్లో ఇంకెవ‌రినీ చూడ‌లేం. కృష్ణ‌గారికి జీవిత భాగ‌స్వామినిగా ఎప్పుడూ ఆయ‌న ప‌క్క‌న నిల‌బ‌డి ఆయ‌న‌కు చేదోడు వాదోడుగా ఉంటూ త‌న ధ‌ర్మాన్ని నెర‌వేరుస్తూ వ‌చ్చారు. ఆమె లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావ‌త్ తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, ఆ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తూ కృష్ణ‌గారికి, న‌రేష్ కి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

మహిళా సాధికారితను చాటింది: బాలకృష్ణ

మహిళా సాధికారితను చాటింది: బాలకృష్ణ

న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గా త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న విజ‌య‌నిర్మ‌ల‌గారు క‌న్నుమూయ‌డం ఎంతో బాధాక‌రం. సినీ రంగ పరిశ్ర‌మ‌లో మ‌హిళా సాధికార‌త‌ను చాటిన అతి కొద్ది మంది మ‌హిళ‌ల్లో విజ‌య‌నిర్మ‌ల‌ గారు ఒక‌రు. నాన్న‌గారి `పాండురంగ మ‌హ‌త్యం` సినిమాలో కృష్ణుడిగా న‌టించారు. అదే ఆవిడ న‌టించిన తొలి తెలుగు సినిమా. బాలన‌టి నుంచి హీరోయిన్‌గా కూడా ఎన్నో గొప్ప చిత్రాల్లో న‌టించారు అని బాలకృష్ణ గుర్తు చేసుకొన్నారు.

 నాన్నగారితో అనుబంధం: బాలకృష్ణ

నాన్నగారితో అనుబంధం: బాలకృష్ణ

నాన్న‌నందమూరి తారక రామారావు గారితో మారిన మ‌నిషి, పెత్తందార్లు, నిండుదంప‌తులు, విచిత్ర‌కుటుంబం సినిమాల్లో న‌టించారు. అలాగే ద‌ర్శ‌కురాలిగా 44 చిత్రాల‌ను డైరెక్ట్ చేయ‌డం చాలా గొప్ప విష‌యం. ద‌ర్శ‌కురాలిగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించి ఎంతో మంది మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. ఆమె మృతి చిత్ర‌సీమ‌కు తీర‌నిలోటు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆ భ‌గ‌వంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని నంద‌మూరి బాల‌కృష్ణ‌ భావోద్వేగానికి లోనయ్యారు.

11 ఏళ్ల వయసులోనే: మంత్రి తలసాని

11 ఏళ్ల వయసులోనే: మంత్రి తలసాని

11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో నటిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన విజయ నిర్మల..రంగుల రాట్నం చిత్రంతో హీరోయిన్ పరిచయం అయ్యారు. అత్యధిక చిత్రాల్లో క‌ృష్ణ పక్కనే హీరోయిన్‌గా నటించారు. వీరిద్దరూ కలిసి 47 సినిమాల్లో జంటగా నటించారు.

ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా..ఆమె గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. విజయ నిర్మల మరణం తో చిత్ర పరిశ్రమ ప్రముఖ దర్శకురాలు, నటిని కోల్పోయింది.

విజయనిర్మల మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అలాగే ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలి అని మంత్రి తలసాని వేడుకొన్నారు.

గిన్నీస్ బుక్ రికార్డుతో.. వైఎస్ జగన్

గిన్నీస్ బుక్ రికార్డుతో.. వైఎస్ జగన్

అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సినీ రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకొన్నారు. విజయనిర్మల కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుపుతూ..అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన మేటి దర్శకురాలైన విజయనిర్మల మరణం చిత్రపరిశ్రమకు తీవ్ర లోటు అని అన్నారు.

 చరిత్రలో నిలిచిపోతారు: మారుతి

చరిత్రలో నిలిచిపోతారు: మారుతి

11 సంవ‌త్స‌రాల‌కే న‌టిగా తెలుగు సినిమా ఇండ‌స్ట్రిని త‌న కుటుంబంగా చేసుకున్న మ‌హ‌న‌టి, గొప్ప ద‌ర్శ‌కురాలు శ్రీమ‌తి విజ‌య‌నిర్మ‌ల గారి హ‌ఠాన్మ‌ర‌ణం విని షాక్ కి గుర‌య్యాను..తెలుగు సినిమా అంటే మ‌గ‌వారి ఆధిక్య‌త వుంటుంది అని చెప్పుకునే ఆ రోజుల్లోనే మ‌హిళా ద‌ర్శ‌కురాలుగా త‌న స‌త్తాచాటిన విజ‌య‌నిర్మ‌ల గారు చ‌రిత్ర లో ఎప్ప‌టికి నిలిచిపోతారు.

అంత‌టి టాలెంటెడ్ లేడి డైరెక్ట‌ర్‌ని మ‌నం ఇప్ప‌ట్లో ఇంకెవ‌రినీ చూడ‌లేం. సూప‌ర్‌స్టార్ కృష్ణ‌గారికి జీవిత భాగ‌స్వామిగా ఎప్పుడూ ఆయ‌న ప‌క్క‌న వుండేవారు.. ఇప్ప‌డు విజ‌య‌నిర్మ‌ల గారు లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావ‌త్ తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, ఆ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తూ కృష్ణ‌గారికి, న‌రేష్ గారికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను.

నన్ను కలిచి వేసింది.. జూనియర్ ఎన్టీఆర్

విజయ నిర్మల గారు సినీ దర్శకులుగా, నటీగా, నిర్మాతగా ఎందరికో మార్గ దర్శకురాలు. భవితరాలకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అత్యంత ప్రతిభావంతురాలైన విజయ నిర్మల గారు ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నన్ను తీవ్రంగా కలిచివేయడమే కాకుండా విషాదంలోకి నెట్టింది. ఆమె ఆత్మకు శాంతి కలుగాలని, కుటుంబానికి మనోధైర్యాన్ని కలిగించాలని భగవంతుడిని వేడుకొంటున్నాను అని జూనియర్ ఎన్టీఆర్ తన సంతాప ప్రకటనను ట్వీట్ చేశారు.

విజయ నిర్మల గారి మరణం దిగ్బ్రాంతికరం: చంద్రబాబు

సీనియర్ నటి విజయ నిర్మల గారి మరణం దిగ్బ్రాంతికరం. నటిగానే కాక దర్శకురాలిగా అనేక కుటుంబ కథా చిత్రాలను అందించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. వారి అభిమానులకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను అని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

విచారకరం అని లోకేష్ ట్వీట్

మహిళా దర్శకురాలిగా విభిన్న చిత్రాలను తెరకెక్కించి, సమున్నత స్థానం సాధించిన ప్రముఖ నటి, హీరో కృష్ణగారి సతీమణి శ్రీమతి విజయ నిర్మల గారి మరణం విచారకరం. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని మాజీ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.

 నమ్మలేకపోతున్నాను.. నిర్మాత ఉషా మల్పూరి

నమ్మలేకపోతున్నాను.. నిర్మాత ఉషా మల్పూరి

తెల‌ుగు సినిమా చ‌రిత్ర లో ఎంద‌రో ద‌ర్శకులు వారి వారి స‌త్తా చాటుకున్నారు.. కాని మ‌హిళా ద‌ర్శకురాలుగా గిన్నిస్ బుక్ రికార్డు ని సాధించిన ద‌ర్శ‌కురాలు మాత్రం శ్రీమ‌తి విజ‌య‌నిర్మ‌ల గారు. సూప‌ర్‌స్టార్ కృష్ణ గారిని, విజ‌య‌నిర్మ‌ల గారిని చూస్తే క‌డుపు నిండుపోయేది అంత అందంగా వుండేది వారి జంట‌. అంత అంద‌మైన న‌టి, నిర్మాత‌, ద‌ర్శ‌కురాలు తిరిగిరాని లోకాల‌కి వెళ్ళిపోయింద‌నే వార్త న‌మ్మ‌లేక‌పోయాను. శ్రీమ‌తి విజ‌య‌నిర్మ‌ల గారి కుటుంబ స‌భ్యులంద‌రికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నాను. ముఖ్యంగా సూప‌ర్‌స్టార్ కృష్ణ గారికి, మా అధ్య‌క్షులు న‌రేష్ గారికి ఆ భ‌గ‌వంతుడు మనోస్థైర్యాన్ని ఇవ్వాల‌ని మ‌న‌స్పూర్తిగా కొరుకుంటున్నాను అని నిర్మాత శ్రీమ‌తి ఉషా మ‌ల్పూరి అన్నారు.

 దర్శకుడు వీఐ ఆనంద్ సంతాపం సందేశం

దర్శకుడు వీఐ ఆనంద్ సంతాపం సందేశం

చిన్న వయ‌సు నుండి మ‌నంద‌రం సినిమాలు చూసేవాళ్ళం కాని శ్రీమ‌తి విజ‌య‌నిర్మ‌ల గారు సినిమాలు చేయ‌టం మెద‌లు పెట్టారు. విజ‌య‌నిర్మల గారికి సినిమా త‌ప్ప వేరే ప్ర‌పంచం లేదు. మ‌హ‌న‌టిగా, గొప్ప ద‌ర్శ‌కురాలుగా, ఉత్త‌మ నిర్మాత‌గా త‌మిళ‌, తెలుగు, మ‌ళ‌యాల భాష‌ల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేఖ‌త చాటుకున్నారు. త‌న సిని కుటుంబాన్ని వ‌ద‌లి వెళ్ళిపోవ‌టం తెలుగు సినిమా అభిమానులంద‌ర‌కి తీవ్ర దిగ్బ్రాంతి క‌లిగించింది. శ్రీమ‌తి విజ‌య‌నిర్మల గారి కుటుంబానికి ముఖ్యంగా సూప‌ర్‌స్టార్ కృష్ణ గారికి, న‌రేష్ గారికి అలాగే వారి అభిమానుల‌కు నా తీవ్ర సంతాపాన్ని తెలియ‌జేస్తున్నాను అని దర్శకుడు వీఐ ఆనంద్ పేర్కొన్నారు.

English summary
Actor, director, Super Star Krishna wife Vijaya Nirmala passed away on June 26th midnight in Hyderabad. She was 73 and she breathed her last in Continental Hospitals in Gachibowli. Vijaya Niramala last rites will be on June 28th. In this occassion, Tollywood Hero Balakrishna condolenced on her demise.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more