Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
విజయ నిర్మల మరణానికి అసలు కారణం.. అందుకే తిరిగిరాని లోకాలకు..
ప్రముఖ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత విజయ నిర్మల ఆకస్మిక మరణాన్ని సినీలోకం జీర్ణించుకోలేకపోతున్నది. దిగ్గజ మహిళ దర్శకురాలు ఇక లేరనే వార్తతో సన్నిహితులు తల్లడిల్లుతున్నారు. ఆమె మరణవార్త తెలియగానే స్నేహితులు, సన్నిహితులు, తోటి కళాకారులు ఆమె పార్ధీవ దేహాన్ని దర్శించుకొనేందుకు పోటేత్తారు. అయితే విజయ నిర్మల మరణానికి అసలు కారణం ఏమిటంటే..
ఆరోగ్యంగానే విజయ నిర్మల కనిపిస్తూ
ఇటీవల కాలంలో విజయ నిర్మల పలు సమావేశాలకు హాజరయ్యారు. చాలా చలాకీగా, ఎప్పుడూ ముఖం మీద నవ్వు చెదరకుండా కనిపించారు. సూపర్ స్టార్ కృష్ణకు అండగా, చేదోడు వాదోడుగా ఉండేవారు. అలాంటి వ్యక్తి మరణించారంటే అభిమానులు నమ్మలేకపోతున్నారు. ఆరోగ్యంగా కనిపించే విజయ నిర్మలకు ఏమైందని ఆరా తీస్తున్నారు.
క్యాన్సర్ వ్యాధితోనే ఆకస్మిక మరణం
అయితే విజయ నిర్మల ఆనారోగ్యానికి కారణం క్యాన్సర్. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు ఆమెకు క్యాన్సర్ ఉందనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. క్యాన్సర్ వ్యాధి ఉందని చెబితే ఆమెపై సానుభూతి కనబరిచేందుకు ఇష్టపడని కుటుంబం ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.
కొద్దికాలంగా సీక్రెట్‌గా చికిత్స
క్యాన్సర్ సోకిందనే విషయం తెలిసినప్పటికీ విజయ నిర్మల చాలా మనోధైర్యంతో ఉన్నారట. క్యాన్సర్ మహమ్మారి వెంటాడుతున్నా ధైర్యాన్ని కోల్పోకుండా దానిని ఎదురించే ప్రయత్నం చేశారని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత కొద్దికాలంగా విజయ నిర్మల కాంటినెంటల్ హాస్పిటల్లో క్యాన్సర్ వ్యాధి కోసం చికిత్స పొందుతున్నారు.
మరణంతో తల్లడిల్లుతున్న సినీ లోకం
విజయ నిర్మల పరిస్థితి విషమించడంతో ఆమెను ఇటీవల కాంటినెంటల్ హాస్పిటల్‌కు తరలించారు. జూన్ 26 అర్ధరాత్రి ఈ లోకాన్ని వీడి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆమె మృతిని జీర్ణించుకోలేని సినీ లోకం తల్లడిల్లుతున్నది. ఆమె ఆత్మకు శాంతి కలుగాలని అందరూ భగవంతుడిని కోరుతున్నారు.