twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కృష్ణతో విజయ నిర్మల ప్రయాణం.. 47 సినిమాల్లో జంటగా

    |

    విజయ నిర్మల నటిగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. అంతేకాకుండా దర్శకురాలిగా వివిధ విభాగాలపై పట్టు సాధించారు. సినీ నిర్మాణంలోని మెలుకువలను తక్కువ వయసులోనే గ్రహించారు. వారిద్దరు కలిసి నటించిన చిత్రాలకూ ఆమె దర్శకత్వం వహించారు. ఆ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. తెర మీద జంటగా కనిపించిన వారిద్దరూ ఆ తర్వాత నిజ జీవితంలో జీవిత భాగస్వామ్యులయ్యారు. అప్పటి నుంచి కృష్ణను ప్రేమగా, ఆప్యాయతగా చూసుకొన్నారు.

    47 చిత్రాల్లో కృష్ణతో జంటగా

    47 చిత్రాల్లో కృష్ణతో జంటగా

    సూపర్ స్టార్ కృష్ణతో కలిసి దాదాపు 50 చిత్రాల్లో జంటగా నటించారు. సాక్షి చిత్రంతో తొలిసారిగా కృష్ణతో విజయ నిర్మల జీవిత ప్రయాణం మొదలైంది. కృష్ణకు కూడా అదే తొలి చిత్రం. కృష్ణతో కలిసి 47 చిత్రాల్లో నటించారు విజయ నిర్మల. అందులో ప్రముఖంగా చెప్పుకొనేవి.. సాక్షి, మోసగాళ్లకు మోసగాడు, భలే మోసగాడు, పండంటి కాపురం, ప్రజా నాయకుడు, మంచివాళ్లకు మంచివాడు, దేవుడు చేసిన మనుషులు, మీనా, అల్లూరి సీతారామరాజు, దేవదాసు, పాడిపంటలు, రామరాజ్యంలో రక్త పాతం, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమాహేమీలు, అంతం కాదిది ఆరంభం, రక్తసంబంధం, సాహసమే నా ఊపిరి, ప్రజల మనిషి, బొబ్బిలి దొర చిత్రాల్లో కలిసి నటించారు. ఇందులో కొన్ని చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు.

    కృష్ణతో పరిచయం.. ప్రేమగా

    కృష్ణతో పరిచయం.. ప్రేమగా

    కృష్ణతో పరిచయం ప్రేమగా మారడం.. ఆ తర్వాత వారిద్దరూ జీవితంలో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి కృష్ణను కంటికి రెప్పలా చూసుకొంటున్నారు. కృష్ణ ఎక్కడ కనిపించినా విజయ నిర్మల పక్కనే ఉండేవారు. అలాగే విజయ నిర్మల కనిపించిన పక్కనే కృష్ణగారు ఉంటారనేంతగా ఆమె ప్రేమను పంచారు. విజయ నిర్మల లేని కృష్ణను ఊహించుకోలేమని సినీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

    నిర్మాతగా కూడా రాణించి

    నిర్మాతగా కూడా రాణించి

    విజయ నిర్మల నిర్మాతగా కూడా రాణించారు. సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణ పతాకంపై 15కుపైగా చిత్రాలను నిర్మించారు. విజయ నిర్మల దర్శకత్వం వహించిన తొలి చిత్రం మీనా. 60 సంవత్సరాలకుపైగా సినీ జీవితంలో విజయనిర్మలను ఎన్నో అవార్డులు, రివార్డులు పలకరించాయి. రఘుపతి వెంకయ్య పురస్కారానికి ఎంపికయ్యారు. దక్షిణాదిలోని ప్రముఖ అవార్డులతో సత్కరింపపడ్డారు.

    ఎన్నో సేవా కార్యక్రమాల్లో

    ఎన్నో సేవా కార్యక్రమాల్లో

    విజయ నిర్మల ఎన్నో సేవ కార్యక్రమాలను చేసే వారు. తన ప్రతీ జన్మదినం రోజున పేద కళాకారులకు ఆర్థిక సహాయం అందించే వారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ తరఫున ఇటీవల తన 73వ జన్మదినం సందర్భంగా 73 వేల రూపాయలు విరాళంగా అందించారు. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

    English summary
    Vijaya Niramala life journey with Super Star Krishna
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X