నటి విజయ నిర్మల అంత్యక్రియలు ఎప్పుడు? ఎక్కడంటే!

ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆమె బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ విజయ నిర్మల మరణించారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. విజయ నిర్మల మృతి వార్త సినీ వర్గాలు, అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. విజయ నిర్మల కుటుంబానికి పలువురు సినీ, వ్యాపార, ఇతర పరిశ్రమల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

విజయ నిర్మల భౌతికకాయాన్ని గురువారం (జూన్ 27న) ఉదయం 11 గంటలకు నానక్‌రామ్‌గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకు వస్తారు. అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శనార్థం అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిలిం ఛాంబర్‌కు తీసుకువచ్చి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తారు. శుక్రవారం మధ్యాహ్నం గానీ, సాయంత్రంగానీ ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.

Vijaya Niramala no more: Her last rites on June 28th

విజయ నిర్మలతన ఏడో ఏటనే 1950లో బాలతారగా మత్స్యరేఖ అనే తమిళ చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. 11వ ఏట పాండురంగ మహాత్యం అనే చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. రంగులరాట్నం సినిమాతో హీరోయిన్‌గా మారారు. సుమారు 200 పైగా చిత్రాల్లో ఆమె నటించారు. తెలుగు, తమిళ మలయాళ చిత్రాల్లో తన ప్రతిభను చాటుకొన్నారు. నటిగా కొనసాగుతూనే దర్శకురాలిగా మారారు. సుమారు 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. సినీ పరిశ్రమలో మహిళా దర్శకురాలిగా ఇదో రికార్డు. 2002లో అత్యధిక చిత్రాలు రూపొందించిన మహిళా దర్శకురాలిగా ఆమె గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X